ETV Bharat / bharat

'రాముడి పేరున అక్రమాలు సరికాదు'

author img

By

Published : Jun 14, 2021, 10:22 PM IST

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ను విమర్శిస్తూ కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ట్వీట్ చేశారు. రాముడి పేరున అవినీతికి పాల్పడటం అన్యాయమని పేర్కొన్నారు.

rahul gandhi on ayodhya land deal, అయోధ్య ఆలయం కుంభకోణంపై రాహుల్​ గాంధీ
అయోధ్య భూవివాదంపై రాహుల్​ గాంధీ స్టేట్​మెంట్​

రాముడి పేరును అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడటం అన్యాయం అని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. 'శ్రీ రాముడు న్యాయానికి, సత్యానికి, విశ్వాసానికి ప్రతీతి. ఆయన పేరుతో అవినీతికి పాల్పడటం అన్యాయం' అని సోమవారం ట్వీట్​ చేశారు.

  • श्रीराम स्वयं न्याय हैं, सत्य हैं, धर्म हैं-
    उनके नाम पर धोखा अधर्म है!#राम_मंदिर_घोटाला

    — Rahul Gandhi (@RahulGandhi) June 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌.. అయోధ్యలో రెండు కోట్లు విలువ చేసే భూమిని రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్​ ఆరోపించింది.

మరో ట్వీట్​..

రాహుల్​ మరో ట్వీట్​లో ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన 'మోదీ మిత్ర-సెంట్రిక్​' కార్యక్రమంపై విమర్శలు చేశారు.

  • GOI’s ‘Modi Mitr-centric’ privatisation drive won’t help the public.

    NYAY will. #PSB #PSU

    — Rahul Gandhi (@RahulGandhi) June 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అది ప్రజలకు నిరుపయోగమని.. కాంగ్రెస్​ ప్రతిపాదించిన 'న్యాయ్'​ పథకం ఎంతో మేలు కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : అయోధ్య ఆలయ భూమిపై వివాదం- అవినీతి నిజమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.