తెలంగాణ

telangana

దిల్లీలో అంజలి తరహా మరో ఘటన.. స్కూటీని ఢీకొట్టి 350 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

By

Published : Jan 28, 2023, 7:06 AM IST

Updated : Jan 28, 2023, 10:20 AM IST

స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని కారుతో ఢీకొట్టారు ఐదుగురు వ్యక్తులు. అనంతరం ఓ యువకుడిని కారుతో 350 మీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

delhi hit and run case
దిల్లీ హిట్ అండ్ రన్ కేసు

దిల్లీలో అంజలి తరహా మరో ఘటన.. స్కూటీని ఢీకొట్టి 350 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

దిల్లీ అంజలి హిట్ అండ్ రన్​ కేసు మరువకముందే అచ్చం అలాంటి ఘటనే మరొకటి దేశ రాజధానిలో వెలుగుచూసింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని కారుతో ఢీకొట్టారు ఐదుగురు వ్యక్తులు. అనంతరం 350 మీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. దిల్లీలోని కేశవపురంలో గురువారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు.

"కన్హయ్య నగర్ ప్రాంతంలోని ప్రేరణ చౌక్ వద్ద టాటా కారు.. యాక్టివా స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై ఇద్దరు యువకులు కూర్చున్నారు. వారిలో ఓ యువకుడు గాలిలో ఎగిరి కారు పైకప్పుపై పడిపోయాడు. అదే సమయంలో మరో యువకుడు ఎగిరి కారు బానెట్‌లో ఇరుక్కుపోయాడు. కారు బంపర్​లో స్కూటీ ఇరుక్కుపోయింది. కారులో ఉన్నవారందరూ మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. నిందితులు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కైలాశ్ భట్నాగర్​, సుమిత్ ఖరీ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు.

--పోలీసులు

Last Updated : Jan 28, 2023, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details