తెలంగాణ

telangana

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్​.. డీఏ 4శాతం పెంపు!

By

Published : Feb 5, 2023, 5:57 PM IST

Updated : Feb 5, 2023, 6:06 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ శుభవార్త చెప్పనుంది! ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను నాలుగు శాతం మేర పెంచనున్నట్లు తెలుస్తోంది.

da hike jan 2023
da hike jan 2023

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్ చెప్పనుంది నరేంద్ర మోదీ సర్కార్​! ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా 38 శాతంగా ఉన్న కరవు భత్యం 42 శాతానికి పెరగుతుంది. ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని జనవరి 1 నుంచే వర్తింపచేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

"2022 డిసెంబర్​కు సంబంధించిన పరిశ్రమ కార్మికుల ద్రవ్యోల్బణ నివేదికను జనవరి 31న కార్మిక శాఖ విడుదల చేసింది. అందులో ఉన్న ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే 4.23 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం డెసిమల్​ పాయింట్​ను పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నాం" అని ఆల్​ ఇండియా రైల్వేమెన్​ ఫెడరేషన్​ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
గతేడాది సెప్టెంబర్​లో నాలుగు శాతం పెంచడం వల్ల కరవు భత్యం 38 శాతానికి చేరింది. పెంచిన డీఏను 2022 జూలై 1 నుంచి వర్తింపజేశారు.

Last Updated : Feb 5, 2023, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details