తెలంగాణ

telangana

సోనూసూద్ పెద్ద మనసు.. ప్రముఖ సారంగి ప్లేయర్​ వైద్యానికి హామీ

By

Published : Nov 30, 2022, 10:39 AM IST

కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన సోనూసూద్..​ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి వాయిద్యకారుడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

sonu sood charity
సోనుసూద్ ​మరోసాయం

సినీ స్టార్ సోనూసూద్ ​మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రముఖ సారంగి వాయిద్యకారుడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఓ ట్విట్టర్​ యూజర్​ పెట్టిన పోస్టుకు స్పందించిన సోనుసూద్​.. సారింగి వాయిద్యకారుడికి సహాయం చేస్తానని తిరిగి ట్వీట్​ చేశారు.

హరియాణాకు చెందిన ప్రముఖ సారంగి ప్లేయర్​ మమన్​ఖాన్​ ఆరోగ్యం బాగాలేదని, సాయానికి ఎవరు ముందుకు రావట్లేదని ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి ట్విట్టర్​ ద్వారా పోస్ట్​ చేశాడు. అతని ఫోటో జత చేస్తూ, ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ రాసుకొచ్చాడు. పోస్ట్​పై స్పందించిన సోనూసూద్​ సాయానికి ముందుకు వచ్చారు. "ఖాన్ సాహిబ్, ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా, తర్వాత మీ సారంగి పాట వింటా" అని రీట్వీట్‌ చేశారు.

ఇంతకీ ఎవరి మమన్​ఖాన్​?
మమన్ ఖాన్​ (83) హిసార్ జిల్లా ఖరక్ పూనియా గ్రామానికి చెందిన వారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతి అవార్డు సైతం అందుకున్నారు. హరియాణా ప్రభుత్వం నుంచి పలు అవార్డులు స్వీకరించారు. పౌర సంబంధాల శాఖలో ప్రభుత్వం ఆయనకు ఉద్యోగాన్ని కల్పించింది. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ఆయన.. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మమన్ ఖాన్ తాత, తండ్రి జింద్ మహారాజు ఆస్థానంలో సారంగి వాయిద్యకారులుగా ఉండేవారు.

ABOUT THE AUTHOR

...view details