ETV Bharat / sitara

సోనూసూద్​ దాతృత్వం.. కూలీల కోసం ఏకంగా విమానం

author img

By

Published : May 29, 2020, 8:32 PM IST

లాక్​డౌన్​ కారణంగా కేరళలో ఇరుక్కుపోయిన ఒడిశాకు చెందిన 169 మందిని ప్రత్యేక విమానం ద్వారా వారి స్వరాష్ట్రానికి చేర్చారు బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్​. ఈ విషయాన్ని ఎయిర్‌ ఏషియా అధికారులు తెలిపారు.

Sonu Sood
సోనూ సూద్​

సోనూ సూద్​ దాతృత్వం

బాలీవుడ్​ ప్రముఖ నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల పాలిట ఓ హీరో. "మేం ఫలానా చోట చిక్కుకుపోయాం" అని అయనకి సమాచారం అందిస్తే చాలు వారిని తమ స్వస్థలాలకు చేరవేస్తున్నారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారిని సొంత గ్రామాలకు పంపిస్తూ వారి పాలిట దేవుడయ్యారు. తాజాగా సోనూసూద్ వలస కూలీల కోసం చేసిన మరో సాయం ఊహకు కూడా అందనిది. మానవత్వంతో వ్యవహరించి అందరి మెప్పు పొందారు. బతుకు తెరువు కోసం కేరళకు వలస వచ్చి ఇరుక్కుపోయిన 169 మహిళలను ప్రత్యేక విమానం ద్వారా తమ స్వస్థలమైన ఒడిశాకు చేర్చారు.

కేరళలోని ఓ టెక్స్‌టైల్స్‌ ఫ్యాక్టరీలో ఒడిశాకు చెందిన 150 మంది మహిళలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరంతా కుటుంబ సభ్యులకు దూరంగా అక్కడే ఉండిపోవాల్సిన వచ్చింది. ఈ మహిళలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేశారు. రవాణా సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రామిక్‌ రైలు వెంటనే అందుబాటులో లేకపోవడం, చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరి కష్టం తెలుసుకున్న సోనూసూద్‌ చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. దేశంలో వలస కార్మికుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

"వలస కార్మికులతో కొచ్చి విమానాశ్రయంలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన విమానం 10.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంది. ఇందుకు అయిన ఖర్చంతా సోనూసూద్‌ భరించారు" అని ఎయిర్‌ ఏషియా అధికారులు తెలిపారు. టెక్స్‌టైల్స్‌ కంపెనీకి చెందిన 150 మంది మహిళలతోపాటు.. తొమ్మిది మంది వుడ్‌ వర్కర్స్‌ కూడా విమానంలో ప్రయాణించారు.

తాజాగా సోనూసూద్‌ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన సాయం పొందిన వలస కార్మికురాలికి మగశిశువు జన్మించాడని, ఆమె కుమారుడికి 'సోనూసూద్‌ శ్రీవాస్తవ' అని పేరు పెట్టారని అన్నారు. ఆ తల్లి తనపై చూపిన ప్రేమ మనసును తాకిందని ఆనందం వ్యక్తం చేశారు. వలస కార్మికుల కుటుంబాలు రోడ్లపై నడుస్తున్న దృశ్యాలు చూసి ఎంతో బాధపడ్డానని, చిన్న పిల్లలు చెప్పులు లేకుండా ఎండలో నడవడం కంటతడి పెట్టించిందని సోనూసూద్‌ అన్నారు. వారికి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకుని.. ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించానని చెప్పారు.

ఇదీ చూడండి : విలన్ కాదు అతడు రియల్​ హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.