ETV Bharat / sitara

స్వగ్రామంలో ఈ-రిక్షాలు పంపిణీ చేసిన సోనూసూద్

author img

By

Published : Feb 12, 2021, 6:56 PM IST

నటుడు సోనూసూద్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పంజాబ్​లోని తన స్వగ్రామం మోగా పట్టణంలో ఎనిమిది మందికి ఈ-రిక్షాలు అందించి వారి ఎదుగుదలకు సాయపడ్డారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో మాట్లాడిన సోనూ పలు విషయాలు పంచుకున్నారు.

Sonusood distribute E Ricshaw
సోనూసూద్

సోనూసూద్.. సినిమాల్లో విలన్​గా ఎంతగానో పేరు తెచ్చుకున్న ఈ నటుడు లాక్​డౌన్​లో హీరోగా మారిపోయారు. వలస కూలీలకు సాయం చేస్తూ అందరి ప్రశంసలు పొందారు. లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేశాక షూటింగ్స్​లో పాల్గొంటున్న సోనూసూద్ ఇప్పటికీ తన సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా తన మంచి మనసు మరోసారి చాటుకున్నారు. పంజాబ్​లోని తన స్వగ్రామం మోగా పట్టణంలోని ఎనిమిది మంది నిరుద్యోగులకు ఈ-రిక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్​, బావ గౌతమ్ సచార్​ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన సోనూ పలు విషయాలు పంచుకున్నారు.

ఈ రిక్షాలు పంచుతున్న సోనూసూద్

"దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నా. దీంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. అందరు కూడా అవసరమైన వారికి తోచినంత సాయం చేయండి. నేను నా తల్లిదండ్రుల నుంచి ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నా. నేను దేవుణ్ని కాదు.. అందరిలాగే అవసరమైన వారికి సాయం చేస్తూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా" అంటూ చెప్పుకొచ్చారు సోనూసూద్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.