తెలంగాణ

telangana

పొలంలో అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి

By

Published : Mar 23, 2021, 1:54 PM IST

ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్లిద్దరు పొలంలో చెట్టుకు ఉరేసుకొని విగతజీవులుగా మారిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బిసాల్​పుర్​ ప్రాంతంలో జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bodies of 2 sisters found hanging in UP's Pilibhit
పొలంలో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు

ఉత్తర్​ప్రదేశ్​లో అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పొలంలోని ఓ చెట్టుకు వీరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.

పిలిభిత్ జిల్లా బిసాల్​పుర్​లోని ఓ పొలంలో మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. యువతులిద్దరూ సోమవారం నుంచి కనిపించకుండా పోయారని వెల్లడించారు.

పొలంలో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జయప్రకాశ్ స్పష్టం చేశారు.

యువతుల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:ప్రమాదంలో యువకుడు మృతి- పోలీసులపై దాడి

ABOUT THE AUTHOR

...view details