తెలంగాణ

telangana

Bihar Caste Census Supreme Court : 'కులగణన అధికారం కేంద్రానిదే! రాష్ట్రాలకు సంబంధం లేదు'

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 7:15 AM IST

Bihar Caste Census Supreme Court Centre Reply : దేశంలో జనగణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికే ఉంటుందని మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజ్యాంగం ప్రకారం జనగణన చేపట్టే అధికారం కేంద్రానిదే అని స్పష్టం చేసింది. బిహార్‌లో కులగణనపై ( Bihar Caste Census 2023 ) నీతీశ్‌కుమార్‌ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది.

Bihar Caste Census Supreme Court Centre Reply
Bihar Caste Census Supreme Court Centre Reply

Bihar Caste Census Supreme Court Centre Reply : బిహార్‌లో సీఎం నీతీశ్‌ ప్రభుత్వం తీసుకున్న కులగణన సర్వే నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. జనాభా గణన కేంద్రానికి సంబంధించిన అంశమని పేర్కొంటూ సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. జనగణన ( Bihar Caste Census Data ) కేంద్ర జాబితాలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ అధికారం ఉందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. జనాభా గణన చట్టబద్ధమైన ప్రక్రియ అని, జనాభా గణన చట్టం 1948 ప్రకారం దీన్ని చేపడతారని పేర్కొంది. భారత రాజ్యాంగం ఏడవ షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో దీన్ని చేర్చినట్లు తెలిపింది. రాజ్యాంగంలోని నిబంధనలు, వర్తించే చట్టానికి అనుగుణంగా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

కులాల వారీగా జనాభా లెక్కించేందుకు బిహార్‌ కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. పట్నా హైకోర్టు ఇటీవల బిహార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏక్‌ సోచ్‌ ఏక్‌ ప్రయాస్‌ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్​వీఎన్ భట్టీలతో కూడిన బెంచ్.. విచారణ చేపడుతోంది. కుల గణన చేపట్టడం ద్వారా వ్యక్తుల గోప్యతా హక్కుకు ప్రభుత్వం భంగం కలిగిస్తోందని యూత్ ఫర్ ఈక్వాలిటీ స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. అయితే, కుల గణనలో సేకరించిన సమాచారాన్ని బహిరంగంగా ప్రచురించనప్పుడు సమస్యేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతకుముందు.. కుల గణనకు పట్నా హైకోర్టు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

సర్వే పూర్తి...
బిహార్​లో కులగణన ఇప్పటికే పూర్తైందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 6న సర్వే పూర్తి కాగా.. ఆగస్టు 12న సమాచారాన్ని అప్​లోడ్ ( Bihar Caste Census Website ) చేశారని తెలిపింది. ఈ సమాచారం ప్రభుత్వ శాఖల వద్దే ఉంటుందని స్పష్టం చేసింది.

'కులం వద్దు.. వర్గం వద్దు'.. ప్రభుత్వ బడులపై సర్కార్​ కీలక నిర్ణయం!

'కుల'వరమా.. కలవరమా?.. బిహార్‌లో నీతీశ్‌ ప్రయోగం ప్రభావమెంత?

ABOUT THE AUTHOR

...view details