తెలంగాణ

telangana

దిల్లీ అనాజ్​మండీ ప్రమాద ఘటనపై రాజకీయ దుమారం

By

Published : Dec 9, 2019, 7:42 AM IST

దిల్లీ అనాజ్​మండీలో అగ్ని ప్రమాదం కారణంగా 43 మంది దుర్మరణం చెందిన విషాద ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రమాదానికి కేజ్రీవాల్ ప్రభుత్వానిదే బాధ్యత అని భాజపా ఆరోపించింది. కాషాయం పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని  ఆప్​ పార్టీ తీవ్రంగా స్పందించింది.

FIRE-POLITICS
దిల్లీ అనాజ్​ మండీ ప్రమాద ఘటనపై రాజకీయ దుమారం

దిల్లీలోని అనాజ్‌మండీలో నాలుగు అంతస్థుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. భవనంలోని యూనిట్లకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇచ్చినా..దిల్లీ సర్కారు వారిని అక్కడకు తరలించకపోవడం వల్లే అవి ఇంకా అక్కడే ఉన్నాయని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ఆరోపించారు. భాజపా శవ రాజకీయాలు చేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ మండిపడింది. ఈ రెండు పార్టీలనూ కాంగ్రెస్‌ తప్పుబట్టింది.

కేజ్రీవాల్​పై భాజపా విమర్శలు..

అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రోజే ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ తిమార్​పుర్​లో ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లారని.. అది ఆయన కఠిన మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్​ తివారీ. ఈయన వ్యాఖ్యలను తిప్పికొట్టింది ఆమ్​ ఆద్మీ పార్టీ. అగ్ని ప్రమాదంలో మృత్యువాతపడ్డ వారికి సంతాపం తెలిపిన తర్వాతే కార్యక్రమం ముగించినట్లు బదులిచ్చింది.

గుణపాఠం నేర్చుకోలేదు..

1997లో దిల్లీలోని ఉపహార్‌ సినిమా థియేటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 59 మంది మృతి చెందిన ఘటన నుంచి కేజ్రీవాల్​ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని కాంగ్రెస్ విమర్శించింది. అక్రమ భవనాలకు ప్రభుత్వ అనుమతులపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేసింది.

ఇదీ చూడండి:దిల్లీఫైర్: కన్నీరు పెట్టిస్తున్న కార్మికుడి చివరి కాల్

ABOUT THE AUTHOR

...view details