తెలంగాణ

telangana

మహారాష్ట్ర, ఒడిశాలను తాకిన నైరుతి రుతుపవనాలు

By

Published : Jun 11, 2020, 8:29 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నెలారంభంలోనే కేరళను తాకిన ఈ రుతుపవనాలు.. తాజాగా మహారాష్ట్ర, ఒడిశాలనూ తాకాయి.

Monsoon arrives in Maharashtra, coastal areas receive showers
మహారాష్ట్ర, ఒడిశాలను తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతువనాలు మహారాష్ట్రను చేరాయి. వీటి తాకిడితో గురువారం తీరప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ఐఎండీ.

ఈ రుతుపవనాల వల్ల మహారాష్ట్రలోని హార్నై, సోలాపుర్​.. తెలంగాణలోని రామగుండం.. ఛత్తీస్​గఢ్​లోని జగ్దల్​పుర్​లలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

ఒడిశానూ కూడా..

నైరుతి రుతుపవనాలు ఒడిశాను కూడా తాకాయని ఐఎండీ ప్రకటించింది. దీంతో రాబోవు 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ ప్రభావం.. దక్షిణ, తూర్పు ఒడిశా ప్రాంతాల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

రుతు పవనాల ఆరంభంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల రైతులకు ఊరట లభించినట్లయింది. తూర్పు- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నట్లు భువనేశ్వర్​ వాతావరణ విభాగం తెలిపింది.

ఇదీ చదవండి:'ఉత్తర భారతంలో ఈ ఏడాది వర్షాల జోరు.. కానీ'

ABOUT THE AUTHOR

...view details