తెలంగాణ

telangana

వైద్య పరికరాల గోదాములో భారీ అగ్ని ప్రమాదం

By

Published : Jul 9, 2020, 5:08 AM IST

దిల్లీ ముంద్కా ప్రాంతంలోని ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 34 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

DL-FIRE
అగ్ని ప్రమాదం

దక్షిణ దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంద్కా ప్రాంతంలోని ఓ గోదాములో బుధవారం రాత్రి 10.23 గంటలకు ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటల భారీగా చెలరేగిన నేపథ్యంలో 34 అగ్నిమాపక శకటాలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు దిల్లీ అగ్నిమాపక డైరెక్టర్‌అతుల్‌ గార్గ్‌ తెలిపారు. గోదాములో వైద్య పరికరాలు ఉన్నట్లు గార్గ్‌ వెల్లడించారు.

ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు.

ఇదీ చూడండి:భాజపా నేతపై ముష్కరుల దాడి- ముగ్గురి మృతి

ABOUT THE AUTHOR

...view details