తెలంగాణ

telangana

దిల్లీలో ఇంకా తీవ్ర స్థాయిలోనే గాలి నాణ్యత

By

Published : Oct 31, 2020, 1:06 PM IST

కొంత కాలంగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న దిల్లీలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలోనే  ఉందని కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా.. పరిస్థితులు క్రమంగా  మెరుగుపడతాయని తెలిపింది. అయితే.. పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పంటలను కాల్చడం వల్లే.. ఈ సమస్య తలెత్తుతోందని అధికారులు స్పష్టం చేశారు.

Delhi's air quality hits 'very poor' category
దిల్లీలో స్వల్పంగా మెరుగుపడిన గాలి నాణ్యత

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత ఇంకా తీవ్ర స్థాయిలో ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెల్లడించింది. శనివారం ఉదయం నాటికి పరిస్థితులు తీవ్రస్థాయిలోనే ఉన్నా.. మారుతున్న వాతావరణం వల్ల.. క్రమంగా మార్పు వస్తుందని అంచనా వేసింది. రెండు రోజుల్లో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొంది.

గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) ప్రకారం.. శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో 369గా నమోదైంది. శుక్రవారం ఈ రీడింగ్​- 374గా ఉండగా, గురువారం- 369, బుధవారం- 297, మంగళవారం- 312, సోమవారం- 353గా ఉంది. దిల్లీలోని పలుప్రాంతాల్లో 400కుపైగా తీవ్ర కాలుష్య నాణ్యత నమోదైంది.

అటు.. ప్రత్యేక కాలుష్య విభాగం(పీఎం)లో శుక్రవారం 2.5 పాయింట్లు(19శాతం) నమోదైందని ఎర్త్​ సైన్సెస్​ ఎయిర్​ క్వాలిటీ మానిటరింగ్​ ఏజెన్సీ(సాఫర్​) తెలిపింది. గురువారం 36శాతానికి చేరిన ఈ సంఖ్య.. గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. బుధవారం- 18శాతం, మంగళవారం- 23శాతం, సోమవారం- 16శాతం, ఆదివారం-19 శాతంగా ఉన్నట్టు సాఫర్​ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​లలో వ్యవసాయ భూముల్ని కాల్చడం వల్లే.. దిల్లీ కాలుష్య ప్రభావానికి లోనవుతున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి-ఆరోజు నల్ల రిబ్బన్లలో 'మహా' మంత్రుల విధులు

ABOUT THE AUTHOR

...view details