ETV Bharat / bharat

ఆరోజు నల్ల రిబ్బన్లలో 'మహా' మంత్రుల విధులు

author img

By

Published : Oct 31, 2020, 10:27 AM IST

కర్ణాటకతో సరిహద్దు ప్రాంతాల వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మహారాష్ట్ర మంత్రులు ఏక్​నాథ్ శిందే, ఛగన్ భుజ్​బల్​​. ఈ మేరకు వివాదాస్పద ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు లేఖ రాసినట్లు చెప్పారు.

Trying to include disputed regions of Karnataka in Maharashtra: Ministers
నల్ల రిబ్బన్లలో విధులు నిర్వహించనున్న 'మహా' మంత్రులు

మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు లేఖలు రాశారు మరాఠీ మంత్రులు ఏక్​నాథ్ శిందే, ఛాగన్​ భజ్​బుల్​. బెల్గాం ప్రాంతాన్ని తమ రాష్ట్రంలో కలుపుకొనేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 6 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ వివాదం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"బెల్గాంను మహారాష్ట్రలో కలుపుకొనేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. అది జరిగిన రోజు చారిత్రకం అవుతుంది. ఆ ప్రాంత ప్రజలకు మేం అండగా ఉన్నాం. 6 దశాబ్దాలకు పైగా దీనిపై పోరాటం జరుగుతోంది. త్వరలోనే బెల్గాం, కార్వార్​, నిపాని, బీదర్​, భాల్కీ ప్రాంతాలను మహారాష్ట్రలో చేర్చుతాం. ఈ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. యెల్లూర్ ప్రజలపై జరిగిన దాడులను మరాఠీలు తీవ్రంగా వ్యతిరేకించారు.''

- లేఖలో మంత్రులు

కర్ణాటకలో భాగంగా ఉన్న బెల్గాం, కeర్వార్​, నిప్పాని ప్రాంతాలు తమవని మహారాష్ట్ర చెబుతోంది. అక్కడ అధిక మంది మరాఠీ భాష మాట్లాడతారని, ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలపాలని ఎన్నో ఏళ్లుగా వాదిస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఏక్​నాథ్ శిందే, ఛాగన్​ భజ్​బుల్​లను సమన్వయకర్తలుగా నియమించారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.

ఈ వివాదం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే మరాఠీలు నవంబరు 1ని బ్లాక్​డేగా పాటిస్తారు. ఈ ఏడాది ఆ రోజున మహారాష్ట్ర మంత్రులందరూ నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.