తెలంగాణ

telangana

ACB Raids at Marriguda MRO House : రూ.4.75 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు.. మర్రిగూడ తహసీల్దార్​ అరెస్ట్

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 2:44 PM IST

Updated : Sep 30, 2023, 9:23 PM IST

ACB Raids
ACB Raids at Marriguda MRO House

14:31 September 30

మర్రిగూడ తహసీల్దార్ మహేందర్‌రెడ్డి నివాసంలో అ.ని.శా. సోదాలు

ACB Raids at Marriguda MRO House ర్రిగూడ తహసీల్దార్ మహేందర్‌రెడ్డి నివాసంలో అనిశా సోదాలు

ACB Raids at Marriguda MRO House :నల్గొండ జిల్లామర్రిగూడ తహసీల్దార్ (Marriguda MRO Mahendar Reddy) మహేందర్​​రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ తెల్లవారుజాము నంచి సాయంత్రం వరకు హైదరాబాద్​ హస్తినాపురంలోని మహేందర్​రెడ్డి నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే భారీగా నగదు, బంగారు, ఇతర ఆస్తులను గుర్తించారు.

TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్

ACB Raids in MRO Mahendar Reddy :ట్రంక్ పెట్టెలో భారీగా దాచి పెట్టిన నగదును ఏసీబీ అధికారులు (ACB Officears) గుర్తించారు. ఆ ట్రంక్ పెట్టెను వెల్డర్ సాయంతో తెరిచారు. కౌంటింగ్ మిషన్ సాయంతో నగదు లెక్కించగా.. రూ.2 కోట్లుగా తేలింది. గతంలో కందుకూరులోనూ తహసీల్దార్​గా పని చేసిన మహేందర్ రెడ్డిపై.. అనిశాకు ఫిర్యాదులు రావడంతో దృష్టి పెట్టారు. ఆయన ఇంట్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. మహేందర్​రెడ్డి ఇంటితో పాటు.. వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లల్లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు మహేందర్​రెడ్డి విధులు నిర్వహిస్తున్న మర్రిగూడ ఎమ్మార్వో కార్యాలయంలోనూ అధికారులు సోదాలు చేశారు.

మహేందర్​రెడ్డి, కుటుంబీకుల పేరిట భారీగా స్థిర, చరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. తహసీల్దార్‌కు సంబంధించి మొత్తం రూ.4.75 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహసీల్దార్‌ మహేందర్​రెడ్డిని అరెస్ట్​ చేసి.. అనిశా కోర్టులో అధికారులు హాజరుపరిచారు.

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం.. పక్క​ ప్లాన్​తో రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న అధికారులు

ఇటీవలే సీబీఎస్‌ఈ పాఠశాల ఉన్నతీకరణకు అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పాఠశాల విద్యా శాఖ సిబ్బంది ముగ్గురు.. ఏసీబీకి చిక్కారు. అనిశా రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌కు చెందిన కె.శేఖర్‌ తాను ప్రారంభించిన పూర్వ ప్రాథమిక పాఠశాలను సీబీఎస్‌ఈగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలంటూ.. ఇటీవల దరఖాస్తు చేసుకున్నారని అనిశా డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఈ ఫైల్​ జిల్లా ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్‌ కార్యాలయానికి చేరిందని డీఎస్పీ చెప్పారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బహదూర్​పురా ఎస్సై

ఇక్కడ ఫైల్ ముందుకు కదలకపోవడంతో.. ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్‌ విజయలక్ష్మి వ్యక్తిగత సహాయకుడు సతీశ్‌ను.. శేఖర్‌ సంప్రదించాడని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. తన పై అధికారులు సహాయ డైరెక్టర్‌ సాయి పూర్ణచందర్‌రావు, సూపరింటెండెంట్‌ జగ్జీవన్‌ దస్త్రానికి ఆమోదం తెలిపేందుకు రూ.80,000 ఇవ్వాలని శేఖర్‌కు చెప్పాడని వివరించారు. శేఖర్‌ ఇదే సమాచారాన్నిఏసీబీకి అందించినట్లు పేర్కొన్నారు. ఆర్జేడీ కార్యాలయంలో శేఖర్ నుంచి లంచం తీసుకుంటుండగా సాయి పూర్ణ చందర్‌రావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని చెప్పారు. లంచం డిమాండ్‌ చేసిన జగ్జీవన్‌, సతీశ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. నిందితులు ముగ్గుర్ని రిమాండుకు తరలిస్తామని అన్నారు. ఈ వ్యవహారంలో ఆర్జేడీని కూడా విచారిస్తామని డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు

ACB RIDES: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన డీఎఫ్​వో

మల్కాజి​గిరి సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా సోదాలు..

Last Updated : Sep 30, 2023, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details