ETV Bharat / state

School Education RJD Office Corruption Case Updates : పాఠశాలల ఆర్జేడీ కార్యాలయంపై మరిన్ని ఆరోపణలు.. లోతుగా ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 9:24 AM IST

Updated : Sep 24, 2023, 9:49 AM IST

ACB Raids RJD Vijayalakshmi Office
ACB Invesigates School Education RJD Office Updates

School Education RJD Office Corruption Case Updates : పాఠశాలల ఆర్జేడీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. కొద్ది నెలలుగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై.. లోతుగా ఆరా తీస్తున్నారు. ఆర్జేడీ కార్యాలయంలో పని చేస్తున్న సాయి పూర్ణచందర్‌రావు, జగ్జీవన్‌, సతీష్‌ లంచం తీసుకున్న కేసులో అరెస్టు కావడంతో మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులు.. సైతం తామూ లంచం ఇచ్చామని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

School Education RJD Office Corruption Case Updates పాఠశాలల ఆర్జేడీ కార్యాలయంపై మరిన్ని ఆరోపణలు లోతుగా ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు

School Education RJD Office Corruption Case Updates : పాఠశాలల ఆర్జేడీ కార్యాలయంలో గత మూడు రోజుల కిందట ముగ్గురు సిబ్బంది లంచం తీసుకుంటూ పట్టుబడడంతో.. ఈ కార్యాలయంపై ఏసీబీ పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేసింది. లంచాల వ్యవహారం తెలిసిన కొందరు విద్యా సంస్థలకు చెందిన వారు కూడా.. తామూ లంచం ఇచ్చామని అధికారులకు సమాచారం అందించడంతో ఏసీబీ తీగ లాగే పనిలో పడింది.

Education Employees Arrested in Bribing Case Telangana : పాఠశాల అనుమతి కోసం లంచం డిమాండ్.. ముగ్గురు విద్యాశాఖ అధికారులు అరెస్టు

ACB Raids RJD Vijayalakshmi Office : పాఠశాలల అప్‌గ్రేడ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలకు చెందిన ప్రతినిధులు.. తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలని పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి వస్తున్నారు. కార్యాలయంలో ఆర్జేడీ విజయలక్ష్మి సహాయకుడిగా పనిచేస్తున్న సతీష్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆర్జేడీ సహాయకుడినంటూ లంచాలు వసూలు చేస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది.

ఈ ఘటనతో అధికారులు ఆర్జేడీ విజయలక్ష్మిని పిలిచి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అవసరాన్ని బట్టి మరోసారి రావాలని కోరారు. పాఠశాల అప్​గ్రెేడ్​ కోసం ఆర్జేడీ కార్యాలయంలో సంబంధిత అధికారులు వారి దరఖాస్తులు పరిశీలించి.. జూనియర్‌ వద్దకు పంపుతున్నట్టు ఏసీబీ గుర్తించింది. అవి పరిశీలించిన జూనియర్‌ పని పూర్తి కావడానికి డబ్బు చెల్లించాలని చెబుతున్నట్టు సమాచారం.

School Education RJD Office Raids Updates : ఒక్కో అధికారి స్థాయి ఆధారంగా డబ్బు ఇవ్వాలని.. లంచం సొమ్ము రూ.500 నోట్లే ఇవ్వాలని, ఏకంగా కార్యాలయంలోనే ఇవ్వాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల అప్‌గ్రేడ్‌ దస్త్రాలను ఏసీబీ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక నెలలో ఎన్ని పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారు, నిరభ్యంతర పత్రాలు ఎన్ని జారీ చేస్తున్నారు తదితర వివరాలను సేకరించారు.

ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి డీఈఓ కార్యాయలంలో దస్త్రాలను పరిశీలించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పాఠశాలల అప్‌గ్రేడ్‌ అనుమతి ఇస్తున్న ఆర్జేడీ కార్యాలయం పరిధి ఎంతవరకు ఉందనే అంశంపై ఏసీబీ దృష్టి సారించింది. ప్రధానంగా ఈ కార్యాలయంలో అక్రమాలు, అవినీతి మూలాలపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఆర్జేడీ కార్యాలయంలో లంచాలకు సంబంధించిన కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

School Education RJD Office Raids : ఫరూఖ్‌నగర్‌లోని సీబీఎస్‌ఈ పాఠశాల ఉన్నతీకరణకు అనుమతి ఇచ్చేందుకు.. లంచం తీసుకుంటూ పాఠశాల విద్యా శాఖ సిబ్బంది ముగ్గురు ఇటీవల ఏసీబీకి అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. పాఠశాల అప్​గ్రేడ్​ కోసం శేఖర్​ అనే వ్యక్తి నుంచి రూ.80,000 లంచం తీసుకుంటుండగా.. ఆర్జేడీ పీఏ సతీష్​, సూపరింటెండెంట్ జగ్జీవన్‌, అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్​రావు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలోనే కూపి లాగితే డొంక కదులుతోంది.

TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం.. పక్క​ ప్లాన్​తో రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న అధికారులు

Last Updated :Sep 24, 2023, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.