తెలంగాణ

telangana

లిక్కర్ కంపెనీల్లో నోట్ల గుట్టలు- రూ.300 కోట్లు సీజ్- లెక్కించలేక మొరాయించిన క్యాష్ మెషిన్లు!

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 12:20 PM IST

Updated : Dec 8, 2023, 12:49 PM IST

300 Crores Seized In Odisha : ఒడిశాలో రూ.300 కోట్లకుపైగా నగదును సీజ్​ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. సదరు కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలతో బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బును పట్టుకున్నారు.

More Than 300 Crores Of Cash Seized During IT Raid In Odisha
300 Crores Seized In Odisha Sambalpur

300 Crores Seized In Odisha :ఒడిశాలోని సంబల్​పుర్​ జిల్లాలో రూ.300 కోట్లకుపైగా నగదును పట్టుకున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఇందులో భాగంగానే రెండు మద్యం కంపెనీలకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ క్రమంలో బీరువాలో భద్రపరిచిన కోట్ల విలువైన డబ్బు కట్టలను స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. వీటిని బుధవారం నుంచి లెక్కించడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.50కోట్ల నగదును లెక్కించినట్లు అధికారులు చెప్పారు. నగదు లెక్కించే యంత్రాలను నిరాటంకంగా నడిపించేసరికి అవి పనిచేయడం లేదని వివరించారు.

బీరువాలో డబ్బుల కట్టలు
బీరువాలో డబ్బుల కట్టలు

ఝార్ఖండ్​లోనూ..
మరోవైపు,​ ఝార్ఖండ్​లోని పలు మద్యం కంపెనీల్లోనూ దాడులు నిర్వహించింది ఐటీ శాఖ. బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. పశ్చిమ ఒడిశాలో అతిపెద్ద స్వదేశీ మద్యం తయారీ, విక్రయ కంపెనీలలో ఒకటిగా ఉన్న బల్దేవ్ సాహు అండ్​ గ్రూప్ ఆఫ్ కంపెనీస్​కు చెందిన బలంగీర్​ కార్యాలయంలో రూ.150 కోట్లకుపైగా అక్రమ నగదు దొరికింది. అలాగే సంబల్​పుర్​ కార్పొరేట్ కార్యాలయంలో కూడా రూ.150 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బల్దేవ్ సాహు అండ్​ గ్రూప్ సంస్థ బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్​కు వ్యాపార భాగస్వామిగా ఉంది. కాగా, ప్రస్తుతం ఒడిశాలోని బలంగీర్​, సంబల్‌పుక్​ జిల్లాల్లో, ఝార్ఖండ్​లోని రాంచీ, లోహర్దగా ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం సుందర్‌గఢ్​ మద్యం వ్యాపారి రాజ్‌కిషోర్ ప్రసాద్ జైస్వాల్​కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగాయి.

ఐటీ అధికారులు సీజ్​ చేసిన నగదు

చిరు వ్యాపారులపై కూడా..
పన్ను ఎగవేతకు పాల్పడిన కంపెనీలతో సంబంధాలున్నాయంటూ పలు చిరువ్యాపారుల నివాసాలు, వ్యాపార కార్యాలయాలపై కూడా సోదాలు జరిపారు ఐటీ అధికారులు. బౌధ్​ పురునా కటక్‌కు చెందిన వ్యాపారి అశోక్ కుమార్ అగర్వాల్​ రైస్ మిల్లు, ఆయన నివాసంతో పాటు ఇతర ప్రదేశాలపై కూడా 30 మంది సభ్యులతో కూడిన ఆదాయపు పన్ను శాఖ బృందం దాడులు చేసింది. ఇతర మద్యం వ్యాపారులు సంజయ్ సాహు, దీపక్ సాహుల ఇళ్లు, మద్యం దుకాణాలపై కూడా ఐటీ రైడ్​ జరిగింది. అయితే ఈ దాడులపై అటు సంస్థల యజమానుల నుంచి గానీ ఐటీ అధికారుల నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

నిరుద్యోగులకు గుడ్​న్యూస్​- ఐటీఐ అర్హతతో రైల్వేలో 3093 అప్రెంటీస్ జాబ్స్

పెరిగిన బంగారం ధర- భారీగా తగ్గిన వెండి- హైదరాబాద్​, విజయవాడలో ఎంతంటే?

Last Updated :Dec 8, 2023, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details