ETV Bharat / bharat

నిరుద్యోగులకు గుడ్​న్యూస్​- ఐటీఐ అర్హతతో రైల్వేలో 3093 అప్రెంటీస్ జాబ్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 11:43 AM IST

Railway Apprentice Jobs 2023 : న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- ఎన్‌ఆర్‌ పరిధిలోని వర్క్‌షాప్‌లలో యాక్ట్ అప్రెంటీస్‌ శిక్షణ కోసం నోటిఫికేషన్​ను విడుదల చేసింది​. మరి దీనికి కావాల్సిన విద్యార్హతలు, ఏజ్​ లిమిట్​, దరఖాస్తు చివరితేదీ తదితర వివరాలు మీకోసం.

RRC NR Apprentice Recruitment 2023
Railway Apprentice Jobs 2023

Railway Apprentice Jobs 2023 : రైల్వేలో అప్రెంటీస్​ జాబ్స్​ కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు గుడ్​న్యూస్​. న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్​ సెల్(ఆర్‌ఆర్‌సీ) నార్త్‌ రైల్వేలో 3,093 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్​ విడుదలైంది. ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..
RRC NR Apprentice Recruitment 2023 : 3,093 యాక్ట్ అప్రెంటిస్​ పోస్టులు

విద్యార్హతలు..
RRC NR Apprentice Jobs Qualification : అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఏజ్​ లిమిట్​..
RRC NR Apprentice Jobs Age Limit : 2024 జనవరి 11 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ ట్రేడుల్లో(RRC NR Apprentice Jobs Trades)..

  • మెకానికల్
  • ఎలక్ట్రీషియన్​
  • ఫిట్టర్​
  • కార్పెంటర్​
  • ఎంఎంవీ
  • ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్​
  • వెల్డర్​
  • పెయింటర్​
  • మెషినిస్ట్​
  • టర్నర్​
  • ట్రిమ్మర్​
  • రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్ తదితరాలు

దరఖాస్తు రుసుము(RRC NR Apprentice Jobs Application Fees)

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు.
  • మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాలి.

ఎంపిక విధానం(RRC NR Apprentice Jobs Selection Process)

  • పదో తరగతి
  • ఐటీఐ మార్కులు
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్​
  • మెడికల్ ఎగ్జామినేషన్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు(RRC NR Apprentice Recruitment 2023)

  • క్లస్టర్ లఖ్‌నవూ
  • క్లస్టర్ అంబాలా
  • క్లస్టర్ దిల్లీ
  • క్లస్టర్ ఫిరోజ్‌పుర్

ముఖ్యమైన తేదీలు(RRC NR Apprentice Jobs Important Dates)..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం- 2023 డిసెంబర్​ 11
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2024 జనవరి 11
  • మెరిట్ జాబితా ఫలితాలు- 2024 ఫిబ్రవరి 12

అధికారిక వెబ్​సైట్​..
RRC NR Official Website : వయోపరిమితి సడలింపులు సహా నోటిఫికేషన్​కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆర్​ఆర్​సీ ఎన్​ఆర్​ అధికారిక వెబ్​సైట్​ https://www.rrcnr.orgను చూడవచ్చు.

అప్లై ఇలా(RRC NR Apprentice Jobs Apply Online)..

  • ముందుగా ఆర్​ఆర్​సీ ఎన్​ఆర్​ అధికారిక వెబ్​సైట్​ https://www.rrcnr.orgలోకి లాగిన్​ అవ్వండి.
  • హోమ్​పేజీపై కనిపించే 'Engagement of Act Apprentice' ఆన్​లైన్​ అప్లికేషన్​ లింక్​పై క్లిక్​ చేయండి.
  • ఇప్పుడు అడిగిన వివరాలు అందించి రిజిస్టర్​ అవ్వండి. ఆ తరువాత అప్లికేషన్​ ఫారమ్​లో కూడా కావాల్సిన వివరాలను నింపండి.
  • దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలను స్కాన్​ చేసి అప్లోడ్​ చేయండి. అనంతరం అప్లికేషన్​ ఫీజును చెల్లించండి.
  • ముందుజాగ్రత్తగా దరఖాస్తు ఫారాన్ని డౌన్​లోడ్​ చేసి ప్రింట్​అవుట్​ తీసుకొని భద్రపరుచుకోండి.

ఇగ్నోలో 102 టైపిస్ట్ & స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్​ జాబ్స్​- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.