ETV Bharat / bharat

ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్​ జాబ్స్​- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 11:35 AM IST

Railway Apprentice Jobs 2023 : భారతీయ రైల్వేలో అప్రెంటీస్​ శిక్షణ చేయాలనుకుంటున్న వారికి గుడ్​న్యూస్​. ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్​ సెల్ (ఆర్‌ఆర్‌సీ) 1104 యాక్ట్ అప్రెంటీస్​ పోస్టులకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మరి దీనికి కావాల్సిన విద్యార్హతలు, అప్లికేషన్​ చివరి తేదీ తదితర వివరాలు మీకోసం.

RRC NER Apprentice Recruitment 2023
Railway Apprentice Jobs 2023

Railway Apprentice Jobs 2023 : ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని డివిజన్‌/ యూనిట్లలో 1104 యాక్ట్ అప్రెంటీస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల యువతీయువకులు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు..
RRC NER Recruitment 2023 : యాక్ట్ అప్రెంటీస్

ఇన్ని ఖాళీలు..
RRC NER Apprentice Vacancy : 1104 పోస్టులు

ఏజ్​ లిమిట్​..
RRC NER Apprentice Age Limit : 2023, నవంబర్​ 25 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

విద్యార్హతలు..
RRC NER Apprentice Qualification : యాక్ట్​ అప్రెంటీస్​ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి (కనీసం 50% మార్కులు) పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఈ ట్రేడ్‌లు(RRC NER Apprentice Trades)..

  • ఫిట్టర్​
  • వెల్డర్​
  • ఎలక్ట్రీషియన్​
  • కార్పెంటర్​
  • పెయింటర్​
  • మెషినిస్ట్​
  • టర్నర్​
  • పెయింటర్​
  • మెకానిక్ డీజిల్​
  • ట్రిమ్మర్​

ఎంపిక విధానం(RRC NER Apprentice Selection Process)..

  • పదో తరగతి మార్కులు
  • ఐటీఐ మార్కులు
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్​
  • మెడికల్ ఎగ్జామినేషన్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము(RRC NER Apprentice Application Fees)..

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించారు.
  • మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

డివిజన్‌ లేదా వర్క్‌షాప్‌..
RRC NER Apprentice Workshop : ఈ కింది వర్క్​షాపుల్లో అభ్యర్థులు యాక్ట్ అప్రెంటీస్ శిక్షణ పొందాల్సి ఉంటుంది.

  • డీజిల్ షెడ్ (గోండా)
  • డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్)
  • మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్)
  • క్యారేజ్ అండ్‌ వ్యాగన్‌ (వారణాసి)
  • మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్)
  • క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్)
  • బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్​ కంటోన్మెంట్‌)
  • క్యారేజ్ అండ్‌ వ్యాగన్‌ (లఖ్‌నవూ జంక్షన్‌)
  • సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పుర్​ కంటోన్మెంట్‌)

అప్లికేషన్ లాస్ట్​డేట్​..
RRC NER Apprentice Apply Last Date : 2023, డిసెంబర్​ 24 వరకు అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక వెబ్​సైట్​..
RRC NER Official Website : నోటిఫికేషన్​కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆర్​ఆర్​సీ అధికారిక వెబ్​సైట్​ ner.indianrailways.gov.in.ను చూడవచ్చు.

అప్లై ఇలా(How To Apply RRC NER Online)..

  • ముందుగా ఆర్​ఆర్​సీ ఎన్​ఈఆర్​ అధికారిక వెబ్​సైట్​ ner.indianrailways.gov.in.లోకి లాగిన్​ అవ్వాలి.
  • తరువాత హోమ్​ పేజీలో ఉన్న రిక్రూట్​మెంట్​ లింక్​పై క్లిక్​ చేయండి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో అడిగిన అన్ని వివరాలను నింపండి. కావాల్సిన డాక్యూమెంట్లను స్కాన్​ చేసి అప్లోడ్​ చేయండి.
  • రూ.100 అప్లికేషన్​ ఫీజును ఆన్​లైన్​లోనే చెల్లించండి.
  • చివరగా SUBMIT ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • ముందుస్తు జాగ్రత్తగా అప్లికేషన్​ ఫారమ్​ను ప్రింట్ ​అవుట్ తీసుకొని పెట్టుకోండి.

PGCILలో 203 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

NLCలో 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ACIO పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.