తెలంగాణ

telangana

ఇత్తడి బిందెలో ఇరుక్కున్న బాలుడు.. ఇనుప గ్రిల్స్​లో మరో చిన్నారి...

By

Published : Jun 4, 2022, 12:09 PM IST

Updated : Jun 4, 2022, 12:17 PM IST

Child head stuck in vessel: తమిళనాడులో మూడేళ్ల బాలుడు ఇత్తడి బిందెతో ఆడుకుంటూ అందులో ఇరుక్కున్నాడు. మరోవైపు, అదేరాష్ట్రంలో మరో బాలుడు ఇనుప గ్రిల్స్​లో ఇరుక్కుపోయాడు.

3 year old boy gets stuck in a brass vessel
3 year old boy gets stuck in a brass vessel

ఇత్తడి బిందెలో ఇరుక్కున్న బాలుడు.. ఇనుప గ్రిల్స్​లో మరో చిన్నారి...

Child head stuck in vessel:తమిళనాడులోని విల్లుపురంలో మూడేళ్ల బాలుడు ఇత్తడి బిందెలో ఇరుక్కుపోయాడు. తల్లిదండ్రులు ఇంట్లో పని చేసుకుంటుండగా.. బాలుడు బయట ఖాళీ బిందెతో ఆడుకుంటూ అందులో ఇరుక్కున్నాడు. తల భాగం మాత్రమే పైకి ఉండి, మొత్తం శరీరం బిందెలో ఇరుక్కుపోయింది. బాలుడి తల్లిదండ్రులు అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు తిరునెన్నై నల్లూర్ అగ్నిమాపక దళ కార్యాలయానికి తీసుకెళ్లారు.
గంటసేపు కష్టపడ్డ అగ్నిమాపక సిబ్బంది.. కటర్​లను ఉపయోగించి.. బిందెను కత్తిరించారు. అనంతరం చిన్నారిని బయటకు తీశారు. ఆ తర్వాత బాలుడికి ప్రాథమిక చికిత్స అందించారు.

బిందెలో ఇరుక్కున్న చిన్నారి

Boy stuck in Grills:మరోవైపు, ఇదే రాష్ట్రంలోని తంజావూరులో ఒకటిన్నరేళ్ల బాలుడి తల.. వరండా మీద ఉన్న ఇనుప గ్రిల్స్​లో ఇరుక్కుంది. విజయ్ ఆనంద్- కీర్తిక దంపతులు కుంభకోణం పట్టణంలోని ఓ భవనం తొలి అంతస్తులో నివసిస్తున్నారు. ఇంట్లో వీరిద్దరూ పనిచేసుకుంటుండగా.. బాలుడు వరండాలో ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా చిన్నారి ఏడుపు వినిపించేసరికి దంపతులు బయటకు వచ్చారు. పొరుగువారి సాయంతో గ్రిల్స్​ను పక్కకు జరిపి.. చిన్నారిని కాపాడారు.

గ్రిల్స్​లో ఇరుక్కున్న చిన్నారి

ఇదీ చదవండి:

Last Updated : Jun 4, 2022, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details