ETV Bharat / bharat

మరణించిన తండ్రి సమక్షంలోనే ఘనంగా కుమార్తె పెళ్లి!

author img

By

Published : Jun 4, 2022, 11:11 AM IST

Bride Wedding Vows Infront Deceased Father: తండ్రీకూతుళ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి నిదర్శనంగా.. చనిపోయిన తన తండ్రి మైనపు విగ్రహం తయారుచేయించి ఆ ప్రతిమ ముందే తన వివాహాన్ని​ చేసుకుంది ఓ యువతి. ఈ అరుదైన సంఘటన తమిళనాడులో జరిగింది.

The marriage of the daughter before the wax statue of the died father
The marriage of the daughter before the wax statue of the died father

మరణించిన తండ్రి సమక్షంలోనే ఘనంగా కుమార్తె పెళ్లి!

Bride Wedding Infront Deceased Father: సాధారణంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే.. వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తాం. ఏదైనా శుభకార్యాలు జరిగిన సమయంలో మాత్రం వారిలేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. ఇటీవల కాలంలో చాలా మంది తమ కుటుంబసభ్యుల్లో చనిపోయిన వారి లోటు కనిపించకుండా మైనపు విగ్రహాలు తయారు చేయించుకుని శుభకార్యాలను జరుపుకుంటున్నారు. తాజాగా తమిళనాడులోనూ అదే జరిగింది.

The marriage of the daughter before the wax statue of the died father
సెల్వరాజ్​ మైనపు విగ్రహంతో నూతన వధూవరులు

ఈ అరుదైన సన్నివేశం కళ్లాక్కురిచి జిల్లా తిరుకోయిలూరు సమీపంలో థానకనందల్​ గ్రామంలో జరిగింది. అదే జిల్లాకు చెందిన మహేశ్వరి తండ్రి సెల్వరాజ్​.. అనారోగ్య కారణాలతో గతేడాది మార్చి 3న మరణించాడు. ఆ తర్వాత మహేశ్వరికి జయరాజ్​ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న మహేశ్వరి.. తన తండ్రి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలనుకుంది.

The marriage of the daughter before the wax statue of the died father
సెల్వరాజ్​ మైనపు విగ్రహం

కుమార్తె పెళ్లి తన తండ్రి సమక్షంలోనే చేయాలని నిర్ణయించుకున్న సెల్వరాజ్​ భార్య.. రూ.5 లక్షల ఖర్చుతో భర్త మైనపు విగ్రహం తయారు చేయించింది. అర్చకుల వేదమంత్రాల నడుమ తండ్రి మైనపు విగ్రహం ముందే మహేశ్వరి కల్యాణమహోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం మహేశ్వరి తన తండ్రి సెల్వరాజ్ మైనపు విగ్రహాన్ని చూసి బోరున విలపించింది. ఇది చూసి కల్యాణమండపానికి వచ్చిన బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. అచ్చం జీవం ఉన్న మనిషిని పోలిన మైనపు విగ్రహాన్ని చూసిన బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. కుటుంబసమేతంగా వివాహ వేడుకల్లో ఫొటోలు కూడా దిగారు.

ఇవీ చదవండి: పెద్దలసభకు 41 మంది ఏకగ్రీవం.. జాబితాలో చిదంబరం, సిబల్​

దేశంలో 71% మందికి పోషకాహారం దూరం.. ఏటా 17లక్షల మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.