ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆక్రమణలో 2 లక్షల ఎకరాల ఆలయ భూములు: మంత్రి కొట్టు

By

Published : May 9, 2022, 4:41 PM IST

ఆక్రమణలో 2 లక్షల ఎకరాల ఆలయ భూములు
ఆక్రమణలో 2 లక్షల ఎకరాల ఆలయ భూములు

ఆలయాల్లో అవినీతి కట్టడికి చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణల్లో ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణల్లో ఉన్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇందులో 18 పెద్ద దేవాలయాలకు చెందిన భూములు అధికంగా ఉన్నాయన్నారు. దేవాలయాల్లో అవినీతి కట్టడికి చర్యలు తీసుకుంటామని.., భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. దేవాలయ భూముల వివాదాలు ట్రిబ్యునల్​లో తేల్చుకోవాలని సూచించారు. దేవాలయల్లోని ఆభరణాలు డిజిటలైజేషన్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం దేవుడితో ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తితిదే తరహాలో మిగిలిన పెద్ద దేవాలయాల్లోనూ దర్శనం కోసం ఆన్​లైన్ వ్యవస్థ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

"రాష్ట్రంలో 2లక్షల ఎకరాల ఆలయ భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఆలయాల్లోని ఆభరణాలు డిజిటలైజేషన్ చేస్తున్నాం. ఆలయ భూముల వివాదాలు ట్రైబ్యునల్‌లో తేల్చుకోవాలి. తితిదే మాదిరిగా ఆలయాల్లో దైవ దర్శనానికి ఆన్‌లైన్‌ వ్యవస్థ. దైవ దర్శనం కోసం ఆన్‌లైన్ వ్యవస్థ తేవడానికి ప్రయత్నాలు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాల జాబితా సిద్ధం చేస్తున్నాం. హైకోర్టు తీర్పుపై అధ్యయనం చేస్తున్నాం." -కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ మంత్రి

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details