ఆ 45 నిమిషాలు థియేటర్​ ఊగిపోతుంది: మహేశ్​బాబు

author img

By

Published : May 9, 2022, 3:51 PM IST

Updated : May 9, 2022, 11:19 PM IST

mahesh babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం దర్శకత్వం వహించిన చిత్రం 'సర్కారు వారి పాట'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరుశురాంతో కలిసి సర్కారు వారిపాట చిత్ర విశేషాలను మహేశ్ బాబు పంచుకున్నారు. ఆ సినిమా సంగతులేంటో చూద్దాం.

మహేశ్‌బాబు, పరశురామ్‌ కాంబినేషన్‌ సినిమా అనుకున్నప్పటి నుంచి 'సర్కారువారి పాట'కు ప్రేక్షకుల్లో క్రేజ్‌ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సరికొత్త అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలోనే మే 12న ఈ సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు, దర్శకుడు పరశురామ్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'సర్కారువారి పాట' లీక్స్‌పై స్పందించారు. టైటిల్‌ లీక్‌ ఇప్పటికీ తనకి ఆశ్చర్యంగానే ఉందని మహేశ్‌ అన్నారు.

ఈ సినిమా ట్రైలర్‌కు వచ్చిన స్పందన మీకెలా అనిపించింది?

మహేశ్‌: భ్రమరాంబ థియేటర్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. అప్పుడు నేను పారిస్‌లో ఉన్నాను. 'ట్రైలర్‌ టాక్‌ ఎలా ఉంద'ని పరశురామ్‌కి ఫోన్‌ చేసినప్పుడు ఆయన పంపిన విజువల్స్‌ చూసి షాకయ్యా. ఒక ట్రైలర్‌ లాంచ్‌కి ఇంతమంది వస్తారా?అనుకున్నా. వాళ్ల అభిమానానికి హ్యాటాఫ్‌. వాళ్లు నాపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోను.

కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ మీ ఫ్యాన్‌ బేస్‌ పెరుగుతూ వస్తోంది. దానిపై మీ కామెంట్‌?

మహేశ్‌: ఇంత మంది అభిమానం సొంతం చేసుకోవడం నా అదృష్టం. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇంతమంది అభిమానులు దొరికారు. ఇంతమంది సపోర్ట్‌ ఉన్నందుకు సంతోషిస్తున్నా.

sarkaru vaari paata
మహేశ్​బాబు

గ్లామర్‌ రహస్యమేంటని అందరూ మిమ్మల్ని అడుగుతుంటే బోర్‌గా అనిపిస్తుందా?

మహేశ్‌: అలా ఏం లేదు. చాలా బాగుంటుంది. 'గ్లామర్‌ మెయిన్‌టెయిన్‌ చేయలేక దూల తీరిపోతుంది' అని సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ఇందులో నాకు నచ్చిన డైలాగ్స్‌లో అదీ ఒకటి. డైలాగ్‌ చెప్పినప్పుడు.. 'ఈ డైలాగ్‌ ఎలా రాయాలనిపించింది సర్‌' అని పరశురామ్‌ని అడిగా. దానికి ఆయన.. ‘కథ చెబుతున్నప్పుడు మిమ్మల్ని చూశాను సర్‌. మీరు భలే తెల్లగా ఉంటారు. అందుకే ఈ డైలాగ్‌ పెట్టాలనుకున్నా' అని సమాధానమిచ్చారు.

ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?

పరశురామ్‌: చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఆసక్తి. ఎక్కువగా చూస్తుండేవాడిని. ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు అమ్మ చనిపోవడంతో బాధ్యతలు మీద పడ్డాయి. ఆ బాధ్యతలు పూర్తి చేసిన వెంటనే పరిశ్రమలోకి అడుగుపెట్టాలా? వద్దా? అన్న చిన్న సందేహంలో ఉన్నా. 2003లో 'ఒక్కడు’ రిలీజ్‌ అయ్యింది. ఆ సినిమా చూసి ‘సినిమా అంటే ఇలా కూడా చేయొచ్చా?' అని షాకయ్యా. వెంటనే ఇండస్ట్రీలోకి వెళ్లాలని ఫిక్స్‌ అయ్యా. అలా పరిశ్రమలోకి వచ్చా.

కథ రాసినప్పుడే టైటిల్‌ ఇదే పెట్టాలనుకున్నారా?

పరశురామ్‌: లేదండి. సర్‌కి కథ చెప్పేశాక.. ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసే సమయంలో టైటిల్‌ ఏం పెడితే బాగుంటుందా? అని ఆలోచించాను. 'సర్కారువారి పాట' బాగుంటుందని వెంటనే ఓకే చేశా.

మహేశ్‌: అసలేం జరిగిందంటే.. ఓరోజు నేను జిమ్‌లో ఉన్నప్పుడు నమ్రత వచ్చి ‘టైటిల్‌ లీక్‌ అయిపోయిందట. యూఎస్‌ వాళ్లకి అప్పుడే తెలిసిపోయిందట’ అని చెప్పింది. అప్పటివరకూ నాక్కూడా టైటిల్‌ తెలీదు. వెంటనే నేను పరశురామ్‌కి ఫోన్‌ చేసి.. 'ఏంటి సర్‌ టైటిల్‌ లీక్‌ అయ్యిందట? ఇంతకీ ఏమనుకున్నారు?' అని అడగ్గా 'సర్కారు వారి పాట' అని చెప్పారు. 'అదిరిపోయింది. ఇదే ఫిక్స్‌' అని చెప్పా. ఆరోజే అనౌన్స్‌ చేసేశాం. పోస్టర్లు, టీజర్లు లీక్‌ అవ్వొచ్చు కానీ, ఈ టైటిల్‌ ఎలా లీకయ్యిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే.

పరశురామ్‌: ఫైనల్‌ కట్‌తో ఓ వారం రోజులు ముందే మేము ట్రైలర్‌ సిద్ధం చేసుకున్నాం. లీకుల భయంతో ఆ వారం రోజులూ నాకు నిద్రపట్టలేదు. విపరీతంగా టెన్షన్‌ పడ్డా. అది ఇచ్చిన కిక్‌ కంటే కూడా టెన్షన్‌ ఎక్కువగా అనిపించింది.

మే 11న రాత్రి మీరు ఏం చేస్తారు? మీ ఫీలింగ్‌ ఎలా ఉంటుంది?

మహేశ్‌: సినిమా విడుదలంటే కాస్త కంగారు, భయంగా ఉండటం సాధారణమే. కానీ ఈసారి అలా కాదు. ఈ రెండేళ్లలో సినిమా చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. సినిమా పూర్తవడంతో సంతోషంగా ఫీలయ్యాం. ఫలితం పట్ల మేము నమ్మకంగా ఉన్నాం. తప్పకుండా 12న బ్లాక్‌బాస్టర్‌ కొడతాం.

sarkaru vaari paata
ఫ్యామిలీతో మహేశ్​

కీర్తితో ట్రాక్‌ ఎలా ఉంటుంది?

మహేశ్‌: ఫస్టాఫ్‌లో 45 నిమిషాలు మా ట్రాక్‌ ఉంటుంది. ఆ సమయంలో థియేటర్‌ ఊగిపోతుంది. నేను చాలా ఎంజాయ్‌ చేసి వర్క్‌ చేశా. ఈ మధ్యకాలంలో నేను ఇలాంటి క్యారెక్టర్‌ చేయలేదు. ట్రైలర్‌ చూసినప్పుడు అందరూ అదే ఫీలయ్యారు. మహేశ్‌ని 6 ఏళ్లుగా ఇలా చూడలేదనుకున్నారు. అందుకే అందరూ బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ క్రెడిట్‌ మొత్తం పరశురామ్‌కే.

రీజనల్‌ సినిమాకి మొదటిసారి ట్విటర్‌ ఎమోజీ రావడంపై మీ ఫీలింగ్‌ ఏమిటి?

మహేశ్‌: ఆ క్రెడిట్‌ మొత్తం నా టీమ్‌కే.

అభిమాన హీరో కాబట్టి వన్‌ మోర్‌ టేక్‌ చెప్పడానికి ఇబ్బందిపడ్డారా?

మహేశ్‌: అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఆయనకు నచ్చేదాకా ఓకే చేయరు. ఫస్ట్‌ షాట్‌ చాలా టేక్స్‌ తీసుకున్నారు.

మీరు చెప్పకుండానే ఏదైనా సీన్‌లో మహేశ్‌ తన రోల్‌ని ఇంప్రవైజ్‌ చేసుకుని యాక్ట్‌ చేశారా?

మహేశ్‌: అలాంటివి చాలా ఉన్నాయి.

పరశురామ్‌: అవును చాలా ఉన్నాయి. ట్రైలర్‌లో ఓ సీన్‌ చూస్తే ఆయన సిగ్గుపడుతూ సోఫాలో జంప్‌ చేస్తారు. నిజం చెప్పాలంటే అలా చేయమని నేను చెప్పలేదు. కానీ మహేశ్‌ అనుకోకుండా అలా చేశారు. అది బాగుందని ఓకే చేసేసి.. అలాగే ఉంచేశాం.

సముద్రఖని గురించి...?

మహేశ్‌: ఆ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా? అని నేనూ పరశురామ్‌ పడిన టెన్షన్‌ ఎవరూ పడలేదు. ఫస్ట్‌ షెడ్యూల్‌, సెకండ్‌ షెడ్యూల్‌, లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత కూడా ఆ పాత్రకు ఎవర్ని ఎంచుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోయాం. చాలా మంది పెద్ద నటుల పేర్లు పరశురామ్‌ చెప్పారు. ‘వాళ్లు ఈ రోల్‌ చేయరండి’ అని చెప్పేసి.. సముద్రఖని అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా అని చెప్పా. వెంటనే ఆయనకు ఫోన్‌ చేశాం. ఆయన ఓకే చేశారు. ఆయనకు బిగ్‌ థ్యాంక్స్‌ చెప్పాలి. లాస్ట్‌ డే షూట్‌ అప్పుడు సముద్రఖని నా వద్దకు వచ్చి.. ‘సర్‌ ఈ సినిమాలో మీరు చాలా కళ్లజోళ్లు పెట్టుకున్నారు కదా. నాకు ఒకటి గిఫ్ట్‌గా ఇస్తే దాన్ని మీ గుర్తుగా ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో దాచి పెట్టుకున్నాను’ అని అడిగారు. సినిమా మొత్తం అయ్యాక ఆయన పోర్షన్‌, డబ్బింగ్‌ చూశా అప్పుడు అనిపించింది. ఆయనకు ఒక్క కళ్లజోడు కాదు. కళ్లజోళ్ల కొట్టే ఇవ్వాలని.

sarkaru vaari paata
మహేశ్​బాబు

సితారతో ఒక సాంగ్‌ చేయించాలనే ఆలోచన ఎవరిది?

మహేశ్‌: ఆ ఆలోచన తమన్‌దే. మేము క్లైమాక్స్‌ టెన్షన్‌లో ఉన్నప్పుడు తమన్‌ వచ్చి ఈ ఐడియా చెప్పాడు. నేను ఆలోచించేలోపు నమ్రతని కలిసి డిస్కస్‌ చేశాడు. తను సితారతో మాట్లాడింది. వెంటనే ఓకే అయిపోయింది. ఇదంతా రెండు, మూడు రోజుల్లోనే జరిగిపోయింది. నాకు తెలిసేలోపే సితార షూట్‌లో కూడా పాల్గొనేసింది. ఇప్పుడు వచ్చి.. ‘నన్నెందుకు సినిమాలోకి తీసుకోలేదు’ అని అడుగుతుంది.

సితార వీడియో చూశాక మీ ఫీలింగ్‌?

మహేశ్‌: ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. పెద్ద నటి అవుతుంది.

కీర్తికి ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ఏం ఇస్తారు?

మహేశ్‌: మహానటికి ఏం సలహా ఇస్తాం.!

మీరు ఏం తింటారు?

మహేశ్‌: అన్నీ తింటాను. కానీ కరెక్ట్‌గా తింటా. పెరుగు, స్వీట్స్‌, జంక్‌ ఫుడ్‌ తినను. సుమారు పదేళ్ల నుంచి వాటిని దూరంగా పెట్టా. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు అలవాటు అయిపోయింది.

కరోనా సమయంలో కొత్తగా ఏం నేర్చుకున్నారు?

మహేశ్‌: స్విమ్మింగ్‌. పిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకోవడం ఈజీ. ఇప్పుడు కాస్త కష్టమే అయినప్పటికీ నేర్చుకున్నా.

అభిమానుల్ని కలుస్తుంటారా?

మహేశ్‌: ఫ్యాన్స్‌మీట్స్‌తో తరచూ అభిమానుల్ని కలిసి వాళ్లతో ఇంట్రాక్ట్‌ కావడంతో ఎంతో బాగుండేది. నన్ను డైరెక్ట్‌గా చూసినప్పుడు వాళ్లు ఇచ్చే రియాక్షన్స్‌ నాకెంతో ఇష్టం. కరోనా కారణంగా సుమారు రెండేళ్లుగా నేను వాళ్లని కలవలేదు. ఫ్యాన్‌ మీటింగ్స్‌ని మిస్‌ అవుతున్నా. త్వరలోనే కలుస్తా.

నమ్రత, మీరూ గాసిప్స్‌ మాట్లాడుకుంటారా?

మహేశ్‌: మేము ఎప్పుడూ అలాంటి మాట్లాడుకోం. కానీ, నమ్రత వాళ్ల ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు గాసిప్సే గాసిప్స్‌. ముంబయి కదా.. గాసిప్స్‌ మామూలుగా మాట్లాడుకోరు. నేను కేవలం వింటూ ఉంటా. కొన్ని గాసిప్స్‌ అయితే బయటకు కూడా చెప్పలేను.

పరశురామ్‌.. మీరే కనుక ప్రధాని అయితే ఈ శాఖలు ఎవరికి ఇస్తారు?

హెల్త్‌ మినిస్టరీ‌: మహేశ్‌

గాసిప్‌ మినిస్టరీ: రవి (నిర్మాత)

సోషల్‌మీడియా మినిస్టరీ: తమన్‌ (మ్యూజిక్‌ డైరెక్టర్‌)

పార్టీ మినిస్టరీ: నవీన్‌ (నిర్మాత)

డిసిప్లైన్‌ మినిస్టరీ: రాజు

ఫ్యాషన్‌ మినిస్టరీ: కీర్తి సురేశ్‌ అండ్‌ టీమ్‌కి

మహేశ్‌.. మీకు వీటిల్లో ఏది ఇష్టం?

మహేశ్‌: పుస్తకం

పరశురామ్‌: న్యూస్‌ పేపర్‌ ఎక్కువగా చదువుతుంటా

మహేశ్‌: వాచ్, పర్సు‌.. ఈ రెండూ లేవు (లివ్‌ ఇన్‌ ది మూమెంట్‌.. అందుకే వాచ్‌ పెట్టుకోవడం లేదు)

పరశురామ్‌: వాచ్

sarkaru vaari paata
మహేశ్​బాబు

మ.. మ.. మహేశా.. సాంగ్‌ గురించి ఏదైనా చిన్న సంఘటన?
మహేశ్‌: మ మ మహేశా.. సాంగ్‌ క్రెడిట్‌ పరశురామ్‌కే. ఆ ప్లేస్‌లో వేరే సాంగ్‌ ఉండేది. ఆయన నన్ను కన్విన్స్‌ చేసి ఆ పాట చేయించారు. ఎందుకంటే అప్పటికే షూటింగ్‌, డబ్బింగ్‌ అన్నీ అయ్యే సరికి నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. అలాంటి సమయంలో ఆయన ఒప్పించి ఈ పాట చేయించారు. పదిరోజుల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ సెట్‌ చేశారు. శేఖర్‌ మాస్టర్‌ మా ఇంటికి వచ్చి ప్రాక్టీస్‌ చేయించారు. సెట్‌లోకి అడుగుపెట్టి, సాంగ్‌ విన్నాక ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ డ్యాన్స్‌ చేశా. ఇక, ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ గురించి చెప్పాలి. ఇందులో విశాఖ ఆర్కేబీచ్‌లో ఒక సీక్వెన్స్‌ ఉంటుంది. అక్కడ చేయడం కష్టమని భావించి రామోజీ ఫిలింసిటీలో సెట్‌ వేసి చేశాం. యుగంధర్‌ వీఎఫ్‌ఎక్స్‌ బాగా చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూదవండి: రౌడీ హీరో రాజసం.. మిడిల్ క్లాస్​ టు లగ్జరీ లైఫ్​.. ఆస్తుల విలువ తెలిస్తే..

Last Updated :May 9, 2022, 11:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.