ETV Bharat / state

తిరుపతి జిల్లాలో విషాదం - శివాలయంలోని చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి - 3Girls Died After Falling into Pond

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 5:07 PM IST

Updated : May 16, 2024, 8:10 PM IST

Three Girls Died After Falling into Pond in Tirupati District: తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్‌బీఆర్ పురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివాలయానికి వెళ్లిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.

three_girls_died
three_girls_died (Etv Bharat)

Three Girls Died After Falling into Pond in Tirupati District: శివాలయానికి వెళ్లిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వడమలపేట మండలం ఎస్బీఆర్ పురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బాబు భార్య శాంతి తన ముగ్గురు కూతుర్లైన విషిక, చరిత, రుషికలతో కలిసి గులూరు చెరువు కట్టపైన ఉన్న పురాతన శివాలయానికి వెళ్లారు. తల్లి చెరువుల్లో దీపం వదిలేందుకు వెళ్లాగా అదే సమయంలో ముగ్గురు కుమార్తెలు సైతం ఆమె వెంట వెళ్లారు. అక్కడ మెట్లపై తడిగా ఉండటంతో ఆ ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయారు. నిటిలో మునికిపోతున్న పిల్లలను చూసి వారి తల్లి శాంతి వాళ్లను కాపాడేందుకు నీటిలోకి దిగగా ఆమె కూడా మునిగిపోయారు. సమీపంలోనే ఉన్న ఓ మహిళ గట్టిగా కేకలు వేయగా అక్కడున్న ఒక వ్యక్తి తల్లి శాంతిని మాత్రం కాపాడగలిగారు. ఆ ముగ్గురు పిల్లలను కాపాడేలోగా అప్పటికే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే పుత్తూరు సీఐ ఓబులేసు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : May 16, 2024, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.