తెలంగాణ

telangana

హైదరాబాద్ పరిధిలో బీఆర్​ఎస్ ఆధిక్యత మరోసారి నిరూపితం కానుంది : పద్మారావు గౌడ్ - Padma Rao Goud Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 1:57 PM IST

Padma Rao Goud Election Campaign

Padma Rao Goud Election Campaign In Secunderabad : సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్​కు ఉన్న ఆధిక్యత మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో నిరూపితం కానుందని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ సనత్​నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్​తో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. బన్సీలాల్​పేట డివిజన్​లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బన్సీలాల్​పేట డివిజన్​లో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను బీఆర్ఎస్​కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ గెలుపునకు సోపానాలుగా మారుతాయి అని అన్నారు. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో పది సీట్లకు పైగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details