తెలంగాణ

telangana

'నిజామాబాద్‌ లోక్‌సభ పోలింగ్ కోసం 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు' - NZB CP Kalmeswar Interview

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 5:32 PM IST

"నిజామాబాద్‌ లోక్‌సభ పోలింగ్ కోసం 3వేల మంది పోలీసులతో బందోబస్తు" (ETV Bharat)

Nizamabad CP On Election Arrangements : లోక్​సభ ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నిజామాబాద్‌ లోక్‌సభ పోలింగ్ కోసం 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్మర్‌ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద 7 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల టీఎస్‌ఎస్‌పీ బలగాలను మోహరిస్తున్నామని చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఎన్నికల నియమావళి అమలును పక్కాగా పరిశీలించేందుకు 107 మొబైల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.3.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం రూ.24.64 లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్​ చేసినట్లుగా వివరించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెబుతున్న నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్మర్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details