తెలంగాణ

telangana

'మార్స్‌ మధ్యలో మంచు నిక్షేపాలు- ఆ నీటితో ఎర్ర సముద్రాన్ని నింపొచ్చు'

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 7:20 AM IST

Ice Water On Mars : అంగారకునిపై భారీ మొత్తంలో మంచు నిక్షేపాలను యూరప్​ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ మంచు కరిగితే వచ్చే నీటితో భూమీ మీద ఎర్ర సముద్రాన్ని నింపవచ్చని తెలిపారు. యూరప్‌ మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆర్బిటర్‌ అందించిన సమాచారం విశ్లేషిచడం ద్వారా వీటిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Ice Water On Mars
Ice Water On Mars

Ice Water On Mars : అంగారకునిపై మంచు రూపంలో ఉన్న నీటి నిక్షేపాలను యూరప్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యూరోపియన్‌ స్పేస్​ ఏజెన్సీ మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ మిషన్​ ద్వారా మంచు రూపంలో ఉన్న నీటిని కనుగొన్నారు. మార్స్ ఎక్స్​ప్రెస్ అందించిన సమాచారాన్ని అంగారుకుడిపై భారీగా నీరు మంచు రూపంలో భూమి పొరల కింద ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మంచు నిక్షేపాలు 3 పాయింట్‌తో 7 కిలోమీటర్ల మేర మందం కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ మంచు కరిగితే వచ్చే నీరు అంగారక గ్రహం మొత్తాన్ని 2 మీటర్ల మేర వరకు ఉండొచ్చు అని సైంటిస్టుల తెలుపుతున్నారు. అదే నీటితో భూమి మీద ఉన్న ఎర్రసముద్రాన్ని నింపవచ్చని చెబుతున్నారు.

దుమ్ముతో మంచు పొరలు
మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆర్బిటర్‌ 2003లో అంగారకుని కక్ష్యలోకి చేరింది. ఆర్బిటర్‌ అందించిన సమాచారంతో మొదటిసారి 2004 లో రెడ్‌ ప్లానెట్‌లో మంచు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్స్‌పై 2007లో ఇటువంటి నిక్షేపాలు కనుగొన్నా అవి అగ్నిపర్వతాల బూడిద, దుమ్ముతో ఏర్పాడి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఆ తర్వాత 2015లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకునిపై ఉప్పునీటి ప్రవాహాల ఆనవాళ్లను గుర్తించింది. ప్రస్తుతం యూరోపినయన్ మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆర్బిటర్‌ నూతనంగా పంపిన సమాచారం ప్రకారం ఆ నిక్షేపాల్లో దుమ్ముతో సహా మంచుపొరలు కూడా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.

మార్స్ మధ్యలో మంచు పొరలు
విచిత్రం ఏమిటంటే ఈ మంచు పొరలు ధృవాల వద్ద కాకుండా మార్స్ మధ్య భాగంలో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో మార్స్‌పై మానవ మనుగడ కోసం జరిపే ప్రయోగాలకు ఉత్తేజంగా నిలుస్తాయని వెల్లడించారు. కానీ ఈ మంచు నిక్షేపాలు 300 మీటర్ల అడుగున ఉన్నాయని అంత లోతులోని నీరు పరిశోధనలకు అనువుగా ఉండదని అంటున్నారు. మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆర్బిటర్‌ 2004 నుంచి రెండు దశాబ్దాలుగా అంగారకునికి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details