తెలంగాణ

telangana

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 4:19 PM IST

Updated : Feb 20, 2024, 8:04 PM IST

Telangana Rajya Sabha Elections 2024 : తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా 3 ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 3 స్థానాలకు ముగ్గురే బరిలో అభ్యర్థులు ఉండడంతో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్​ యాదవ్, బీఆర్​ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Rajya Sabha Elections 2024
Telangana Rajya Sabha Elections 2024

Telangana Rajya Sabha Elections 2024 :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణ నుంచి 3 స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్​ నుంచి రేణుకా చౌదరి, అనిల్​ కుమార్​ యాదవ్​, బీఆర్​ఎస్​ నుంచి వద్దిరాజు ఎన్నికయ్యారు.

Rajya Sabha Elections 2024 : రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్‌ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు(Rajya Sabha Elections) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎంపీలైన వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్​ నుంచి రేణుకా చౌదరి, అనిల్​ కుమార్​ యాదవ్ నామినేషన్​ దాఖలు చేశారు. ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. కాగా వారి నామినేషన్లను ఈసీ తిరస్కరించింది. దీంతో వారు ముగ్గురే ఉండడంతో వారే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

"నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు. ఈ పదవి నాకొక్కడిదే కాదు కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు అందరిది. పార్టీలో పని చేసిన వారిని గుర్తించి అవకాశం ఇస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలకు ధన్యవాదాలు. ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావించి పరిష్కరిస్తాను." - అనిల్ కుమార్​ యాదవ్​, కాంగ్రెస్​ రాజ్యసభ సభ్యుడు

2024 లోక్​సభ ఎన్నికల తేదీలు ఫిక్స్! మార్చి 9 తర్వాత షెడ్యూల్!

Congress MP Anil Kumar Rally : రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్‌ భారీ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయన గాంధీభవన్‌ వరకు వెళ్లారు. ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు (Congress) ఆయన అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ను కార్యకర్తలు గజమాలతో సత్కరించి బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్​

BRS MP Vaddiraju Latest Comments : విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై పార్లమెంట్​లో గళమెత్తుతానని బీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. అనంతరం గన్​పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. రెండోసారి రాజ్యసభకు పంపించిన కేసీఆర్​కు (KCR) రుణపడి ఉంటానని వద్దిరాజు తెలిపారు. ఖమ్మం జిల్లాలో బీఆర్​ఎస్​కు (BRS ) పూర్వవైభవం తీసుకొస్తామని, మరోమారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్​ఎస్​ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్​ను మళ్లీ ముఖ్యమంత్రి చేసే వరకు శక్తి వంచన లేకుండాపని చేస్తానని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.

"రెండోసారి నాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్​కు ధన్యవాదాలు. బీఆర్​ఎస్​ తిరిగి అధికారంలోకి వచ్చేవరకు శ్రమిస్తాను. పార్టీ నాయకులకు, కార్యకర్త సమస్యలను తీర్చడంలో ముందుంటాను. ఖమ్మంలో బీఆర్​ఎస్​కు పూర్వవైభవం తిరిగి వచ్చేందుకు కృషి చేస్తాను." - వద్దిరాజు రవిచంద్ర, బీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక- తొలిసారి పెద్దల సభకు

Last Updated :Feb 20, 2024, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details