ETV Bharat / politics

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్​

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 3:18 PM IST

Updated : Feb 20, 2024, 5:00 PM IST

BJP Vijaya Sankalpha Bus Yatra Start Today
Bandi Sanjay Speech at Tandur Vijaya Sankalpa Sabha

Bandi Sanjay Speech at Tandur Vijaya Sankalpa Sabha : వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ విశ్వాసం వ్యక్తం చేశారు. తాండూర్​లో కేంద్రమంత్రి బీఎల్​ వర్మతో కలిసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన ఆయన, రాష్ట్రంలో అన్ని స్థానాల్లో కమలాన్ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో గుప్పించిన బండి, బీఆర్​ఎస్​ పార్టీతోనూ కమలం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు.

Bandi Sanjay Speech at Tandur Vijaya Sankalpa Sabha : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. తాండూర్​లో కేంద్రమంత్రి బీఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన బండి, రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. జమ్మూకశ్మీర్​లో 370 ఆర్టికల్‌(Article 370) రద్దు చేసినందుకు 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలని కోరారు.

బీజేపీ వెనుక రాముడు, మోదీ ఉన్నారన్న ఆయన, కాంగ్రెస్‌ వెనుక రాక్షసుడు, రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఉన్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​తో బీజేపీ పొత్తు అని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్‌ ఆక్షేపించారు. గులాబీ పార్టీతో ఎప్పటికీ కమలం పొత్తు పెట్టుకోదని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సమరశంఖం - ప్రచారరథాలు ప్రారంభించిన కిషన్ రెడ్డి

"భారత దేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటివి మోదీ సర్కార్​కే సాధ్యం. బీజేపీ ప్రభుత్వంలో జమ్మూకశ్మీర్​ 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు దేశంలో 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలి. తెలంగాణలో రామరాజ్యం ఏర్పడాలంటే 17 స్థానాల్లోనూ బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించాలి."-బండి.సంజయ్​, కరీంనగర్​ ఎంపీ

BJP Vijaya Sankalpha Bus Yatra Start Today : పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్రం అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రల పేరిట రథయాత్రలు చేపడుతోంది. 17 లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కమలదళం ప్రజల వద్దకు వెళుతోంది. ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాలను(Parliamentary Constituencies) ఐదు క్లస్టర్స్​గా విభజించి, నేడు రెండు క్లస్టర్స్​లో యాత్రను ప్రారంభించారు.

BJP Vijaya Sankalpha Bus Yatra : నారాయణపేట జిల్లా కృష్ణాలో శంఖారావం పూరించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి విజయసంకల్ప యాత్రను ప్రారంభించారు. అలాగే మరో చోట అసోం సీఎం హిమంత బిశ్వశర్మ(Assam CM Himanta Biswasharma) యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ విజయసంకల్ప యాత్ర 114 అసెంబ్లీ సెగ్మెంట్​లలో 5,500 కిలోమీటర్ల మేర జరగనుంది. మార్చి 2వ తేదీతో ఈయాత్ర ముగియనుంది. మక్తల్ రోడ్ షోలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ప్రజలు మూడోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

తొమ్మిదన్నరేళ్లుగా కేంద్రంలో ప్రధాని మోదీ ప్రజలకు అవినీతి రహితపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ వల్ల ఇళ్ల నిర్మాణం సరిగా జరగలేదన్న కేంద్రమంత్రి, పేదల కోసం మోదీ(PM Modi) అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదుల చొరబాట్లు, బాంబు పేలుళ్లు జరిగాయి తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ రెండూ కుటుంబ పార్టీలేనని దుయ్యబట్టారు. గులాబీ పార్టీ మునిగిపోయ నావ అని, ఆ పార్టీతో ఏ రోజూ బీజేపీ పొత్తు పెట్టుకోలేదని వివరించారు.

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్​

బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు అంతా సిద్ధం - ముగింపు సభకు ప్రధాని రాక!

17 పార్లమెంట్‌ నియోజకవర్గాలు - 5,500 కిలోమీటర్లు - 12 రోజులు - బీజేపీ రథయాత్ర నేడే ప్రారంభం

Last Updated :Feb 20, 2024, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.