ETV Bharat / politics

పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సమరశంఖం - ప్రచారరథాలు ప్రారంభించిన కిషన్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 7:17 AM IST

Updated : Feb 19, 2024, 1:19 PM IST

BJP Vijaya Sankalp Yatra in Telangana 2024 : రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రచారరథాలను ప్రారంభించారు.

BJP Yatra for MP Elections in Telangana
BJP Vijaya Sankalpa Yatra for MP Elections in Telangana

పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సమరశంఖం - ప్రచారరథాలు ప్రారంభించిన కిషన్ రెడ్డి

BJP Vijaya Sankalp Yatra in Telangana 2024 : లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసేలా కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. ఆ 5 క్లస్టర్లలో మొత్తం 4 వేల 238 కిలోమీటర్ల మేర రథయాత్రలు సాగనున్నాయి. ఇందులో భాగంగా నేడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్​రెడ్డి ప్రచారరథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంతోనే విజయ సంకల్పయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. రోడ్‌ షోలు నిర్వహిస్తూ, ప్రజలను కలుస్తూ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీన యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

Kishan Reddy on Vijay Sankalp Yatra : హైదరాబాద్‌ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. పాతబస్తీ ముస్లిం సోదరలు కూడా మోదీ గెలవాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. విజయ సంకల్పయాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. యాత్ర మొత్తాన్ని రోడ్‌షోల ద్వారానే నిర్వహిస్తామని పేర్కొన్నారు.

యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ(Modi) రాబోతున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. విజయ సంకల్ప యాత్రకి రాష్ట్ర ప్రముఖులు నేతృత్వం వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌(Bandi Sanjay) ఎంపీ లక్ష్మణ్‌ సహా పార్టీ సీనియర్‌ నేతలు, డీకే అరుణ, ఈటల రాజేందర్ ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొననున్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్రల్లో భాగంగా ఆయా చోట్ల జరిగే కార్నర్‌ మీటింగ్‌లకు(Corner Meeting) బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరు కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Telangana BJP Campaign For Parliament Elections 2024 : కుమురం భీం క్లస్టర్‌ యాత్రను ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma)ప్రారంభిస్తారు. ఆ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోసాగి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది. రాజేశ్వరి క్లస్టర్‌ను వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌(Pramod Sawant) ప్రారంభిస్తారు. ఆ యాత్ర 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంట్‌ నియోజకవర్గాలను చుట్టేసి కరీంనగర్‌లో ముగుస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్‌ యాత్ర భువనగిరిలో ప్రారంభమై మూడు పార్లమెంట్‌ స్థానాలు 21 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసి హైదరాబాద్‌లో ముగుస్తుంది.

భద్రాచలంలో మొదలయ్యే కాకతీయ - భద్రకాళీ క్లస్టర్‌ బస్సుయాత్ర, మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాలను చుట్టేసి ములుగు జిల్లాలో ముగియనుంది. కృష్ణమ్మ క్లస్టర్‌ యాత్రను కృష్ణా నది మక్తల్‌ వద్ద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) ప్రారంభించనున్నారు. ఆ బస్సు యాత్ర మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాలను చుట్టేసి నల్గొండలో ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

'లోక్​సభ ఎన్నికల్లో మాకు 10 సీట్లు ఖాయం - బీసీలను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం'

'వచ్చే 100 రోజులు అత్యంత కీలకం, ప్రతి ఓటరు వద్దకు వెళ్లాలి'- కార్యకర్తలకు మోదీ సూచన

Last Updated : Feb 19, 2024, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.