తెలంగాణ

telangana

బాలకృష్ణకు జ్యూడిషియల్‌ రిమాండ్ - ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 9:14 AM IST

Updated : Jan 25, 2024, 9:25 PM IST

RERA Secretary Shiva Balakrishna Arrested : అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, మెట్రో రైల్‌ ప్రణాళిక అధికారి శివబాలకృష్ణకి ఫిబ్రవరి 8 వరకు నాంపల్లి కోర్టు జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. న్యాయస్థానం జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం తెల్లవారుజామున 14 బృందాలతో ఏసీబీ చేపట్టిన సోదాల్లో 99.60లక్షల నగదు, సుమారు 2 కిలో బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి, స్థిరాస్తి పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.

ACB Raids
ACB Raids in HMDA Planning Director House

RERA Secretary Shiva Balakrishna Arrested: ఏసీబీ సోదాల్లో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. హెచ్‌ఎండీఏ(HMDA) మాజీ డైరెక్టర్, మెట్రో రైల్‌ ప్రణాళిక అధికారి శివబాలకృష్ణకి ఫిబ్రవరి 8 వరకు నాంపల్లి కోర్టు జ్యూడిషయల్‌ రిమాండ్‌ విధించింది. న్యాయస్థానం జ్యూడిషయల్‌ రిమాండ్‌ విధించడంతో ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు

శివబాలకృష్ణ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో పెద్దఎత్తున సొత్తు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి 14 బృందాలతో నిర్వహిస్తున్న ఏసీబీ(ACB Raids) అధికారుల సోదాల్లో 99.60లక్షల నగదు, సుమారు 2 కిలో బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థిర, చరాస్థుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని ఏసీబీ వివరించింది.

బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయనను ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. గతంలో బాలకృష్ణ హెచ్‌ఏండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే మరోవైపు ఎంఏయూడీ (పురపాలన, పట్టణాభివృద్ధి విభాగం)లో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గానూ కొనసాగారు.

హెచ్ఎండీఏ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు

హెచ్‌ఎండీఏ నుంచి దస్త్రాలను పంపించడం, ఎంఏయూడీలో డైరెక్టర్‌ హోదాలో వాటికి జీవోలివ్వం వంటి పనులు ఆయనే చూసుకునేవారు. ఈ క్రమంలో రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, భువనగిరి, సంగారెడ్డి తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

హెచ్‌ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఒక్కో అంతస్తుకు రూ.4 లక్షల వరకు లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు బాలకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. నెలకు 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తుల్ని పోగేశారని అభియోగాలు వచ్చాయి.

ACB Raids in HMDA Planning Director House :బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులోని సమాచారం ఆధారంగా పలు ఆస్తుల దస్తావేజుల్ని సంపాదించిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామునే పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలోని ఆదిత్య పోర్ట్వ్యూ విల్లాలోని బాలకృష్ణ నివాసంతోపాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో నిన్న అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు. పెద్దమొత్తంలో ఆస్తులపత్రాల్ని, రిజిస్ట్రేషన్ దస్తావేజుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అవినీతి శాఖల జాబితాలో ఎక్సైజ్ కూడా చేరింది - ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆసక్తికర​ ట్వీట్

Last Updated :Jan 25, 2024, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details