తెలంగాణ

telangana

ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ షార్ట్​ ఫిల్మ్ ఫెస్టివల్ - 'జషన్ ఎ సైన్మా'కు విద్యార్థుల నుంచి విశేష స్పందన - NATIONAL SHORT FILM FESTIVAL at ou

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 10:04 PM IST

Jashn E Sainma Youth Festival in Osmania University : చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షించేది సినిమా. యువత అయితే సినిమా చూసేందుకే కాదు, తీసేందుకూ ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారికి ఓ అవకాశాన్ని కల్పిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జాతీయ షార్ట్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన చిత్రాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇంకా యాక్టింగ్, ఫిల్మ్‌మేకింగ్ వర్క్‌షాప్‌లు విద్యార్థుల ఆటపాటలు, కేరింతలతో ఆద్యంతం అలరించింది. మరి 2 రోజుల పాటు జరిగిన జషన్ ఎ సైన్మా విశేషాలేంటో మనమూ చూసేద్దామా.

Jashn E Sainma Youth Festival in Osmania University
Jashn E Sainma Youth Festival in Osmania University

జాతీయ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు విశేష స్పందన - ఫిల్మ్‌ కళలు నేర్చుకున్న విద్యార్థులు

Jashn E Sainma Youth Festival in Osmania University :ఉస్మానియా వర్శిటీలో నిర్వహించిన జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు సాగిన వేడుకల్లో దాదాపు రెండు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్శిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్ (Journalism And Mass Communication) ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకారంతో జషన్ ఏ సైన్మాను నిర్వహించారు. ఉస్మానియా చరిత్రలోనే ఇదే మొట్టమొదటి జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కావటం గమనార్హం.

వినూత్నంగా జరిగిన ఈ వేడుకల్లో తొలిరోజు డైరెక్టర్‌లతో ఇంటరాక్షన్ సెషన్, ప్యానెల్ డిస్కషన్స్ చేపట్టి విద్యార్థులకు సినిమా దర్శకత్వంలో ఉండే అంశాలపై అవగాహన కల్పించారు. ఇక రెండో రోజు సౌండ్ డిజైన్‌ (Sound Design)పై చేసిన వర్క్ షాప్ విశేషంగా అలరించింది. సినిమాల్లో సౌండ్ ఎలా యాడ్ చేస్తారు, మ్యూజిక్, మాటలు ఇలా భిన్నమైన శబ్దాలను జత చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా వినోదంతో పాటు విజ్ఞానం వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు.

National Short Film Festival in Hyderabad :జషన్ ఏ సైన్మా కార్యక్రమంలో 2వ రోజు షార్ట్ ఫిలిమ్స్‌ ప్రదర్శనలకు నిర్వాహకులు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన దాదాపు 25కు పైగా షార్ట్‌ ఫిలిమ్స్‌ (Short Films)ని ప్రదర్శించడం విశేషం. ఇక వీటితో పాటు ఓపెన్‌ మైక్‌ పేరుతో విద్యార్థుల్లో దాగున్న కళలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. గ్రూప్‌, సోలో విభాగాల్లో కవిత్వం, పాటలు పాడటం, మ్యూజిక్‌ బ్యాండ్స్‌, డాన్స్‌తో విద్యార్థులు ఆకట్టుకున్నారు.

"చాలా ప్యానెల్‌ మీటింగ్‌లు జరిగాయి. సౌండ్‌, సింగింగ్‌ దానిపై కూడా నాలెడ్జ్‌ వచ్చింది. ఫిల్మ్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఈ ఫెస్ట్‌కు అటెండ్ అవ్వడం వల్ల ఒక మహిళ ఫిల్మ్‌ రంగంలోకి ఎలా అడుగు పెట్టాలో తెలుసుకున్నాను."- విద్యార్థిని

hyderabad paper girls: హైదరాబాదీ పేపర్‌ గర్ల్స్‌ కథ విన్నారా..!

ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను సైతం అందించటం ఈ కార్యక్రమం మరో విశేషం. రెండో రోజు ప్యానెల్‌ డిస్కషన్‌లో పాల్గొన్న కాస్టింగ్‌ డైరెక్టర్‌ పుష్పా భాస్కర్‌, సౌండ్‌ ఇంజినీర్‌ సాజీదా ఖాన్‌ మహిళలకు సినిమా అవకాశాలపై అవగాహన కల్పించారు. ఇక ఫెస్ట్‌లో భాగంగా లైటింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన లైట్‌, యాక్షన్‌ సెట్‌, ఫేషియల్‌, హ్యాండ్‌ పెయింటింగ్స్‌ కార్యక్రమాలు విద్యార్థులను విశేషంగా అలరించాయి.

సినిమా రంగంలో ఉండాలనుకునే వారికి మంచి అవకాశం : వైవిధ్యభరితంగా రెండు రోజుల పాటు సాగిన జషన్ ఏ సైన్మా జాతీయ షార్ట్ ఫిల్మ్‌ ఫెస్టివల్ అద్యంతం యువతను ఆకట్టుకుంది. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు కొత్త పరిచయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్వాహకులు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే ఆసక్తి గల అంశాల్లో నైపుణ్యాలు పెంపొందిచుకోవడానికి వీలుంటుందని విద్యార్థులు చెబుతున్నారు.

'ఇంజినీర్లు, డాక్టర్లు చాలా ఉన్నారులే నాన్న - నేను కళారంగం వైపు అడుగేస్తా'

ప్లాస్టిక్​, పాత ఫర్నీచర్​తోనే అందమైన ఇల్లు కట్టిన యువకుడు - ఎలాగో మీరూ చూసి తెలుసుకోండి

ABOUT THE AUTHOR

...view details