ప్లాస్టిక్​, పాత ఫర్నీచర్​తోనే అందమైన ఇల్లు కట్టిన యువకుడు - ఎలాగో మీరూ చూసి తెలుసుకోండి

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 12:31 PM IST

thumbnail

ECO Friendly Home in Hyderabad : ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనాత్మకత దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి, ఆ ఆలోచనలను ఆచరణలోకి తీసుకువస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. సాధారణంగా ఓ వస్తువు ఉపయోగపడదు అనుకున్నప్పుడు వాటిని చెత్త కుప్పల్లో పడేస్తుంటాం. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లు, పాత చెక్క ఫర్నీచర్​ను పక్కన పడేస్తాం. కానీ వాటి ద్వారానే ఒక ఇళ్లు నిర్మించవచ్చని(Young man Built House with Waste Material) మీకు తెలుసా. ఇది నమ్మలేకపోయినా అక్షరాలా నిజం. మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి వస్తువుతో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు హైదరాబాద్​కు చెందిన యువకుడు భరణి. 

Life in the Box House in Hyderabad : ప్లాస్టిక్ బాటిళ్లు, చెక్క ముక్కలు, పాడైపోయిన ఫ్రిజ్ డబ్బాలతో పర్యావరణ హితంగా 'లైఫ్ ఇన్ ద బాక్స్(Life in the Box)' అనే రెండు అంతస్థుల కంటెయినర్ హోమ్​ను నిర్మించాడు. ఈ బిల్డింగ్​ చూసిన వారి తోటి ఔరా అనిపించుకుంటున్నాడు. కేవలం ఇంటినే కాదు.. తాను ఉపయోగించే ప్రతి వస్తువునూ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తూ ప్రతి ఒక్కరూ పర్యావరణహితం కోసం పాటుపడాలని సందేశమిస్తున్న భరణితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.