తెలంగాణ

telangana

రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు: హరీశ్‌రావు - Harishrao hot comments

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 4:18 PM IST

Updated : Mar 29, 2024, 5:07 PM IST

Harishrao Hot Comments : బీఆర్ఎస్​ పార్టీని వీడుతున్న నేతలపై మాజీమంత్రి హరీశ్​రావు హాట్ కామెంట్స్​ చేశారు. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్​ బ్రోకర్లు పార్టీని వీడిచిపోతున్నారని ఆయన దుయ్యబట్టారు. పార్టీలోంచి వెళ్లిపోయిన వారు, రేపు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Pocharam on Party Jumping Leadrers
Harishrao Hot Comments

Harishrao Hot Comments : కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని మాజీమంత్రి హరీశ్​రావు(Harishrao) పేర్కొన్నారు. దుబ్బాకలో నిర్వహించిన పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, పార్టీ మారుతున్న నేతలపై ఘాటుగా స్పందించారు. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్​ బ్రోకర్లు పార్టీని వీడిచిపోతున్నారని ఆయన దుయ్యబట్టారు.

"పంటలకు పరిహారం ఇవ్వకుంటే లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడిస్తాం" - Harish Rao Comments on CM Revanth

ఇదేం పార్టీకి కొత్తకాదని, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరని హరీశ్​రావు పేర్కొన్నారు. అయినప్పటికీ కేసీఆర్​ తెలంగాణ తెచ్చి చూపెట్టారన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని దుయ్యబట్టారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను, కార్యకర్తలను కొనలేరని స్పష్టం చేశారు.

మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్లు పార్టీలోంచి వెళ్లిపోతున్నారని, పార్టీలోంచి వెళ్లిపోయిన వారిని రేపు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించినట్లు హరీశ్​రావు వెల్లడించారు. ఇది ఆకులు రాలే కాలం, కొత్త చిగురు మళ్లీ పార్టీలో పుట్టుకువస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​ నాయకులను చేర్చుకోవడానికి గేట్లు ఎత్తడం కాదు, ఎండిపోతున్న పంట పొలాలను కాపాడటానికి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు ప్రభుత్వానికి సూచించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్​పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వంలో రైతులను రాజులను చేశారన్నారు. 100 రోజులు కాంగ్రెస్ పాలన విఫలమైందని, హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్​రావు హెచ్చరించారు.

Pocharam on Party Jumping Leadrers: బీఆర్ఎస్​ నుంచి చెత్త అంతా పోయిందని, గట్టివాళ్లే మిగిలారని మాజీస్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారని, పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారని దుయ్యబట్టారు. ఎంపీ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయన్నారు. మోసకారుల జాబితా రాస్తే తొలిపేరు బీబీ పాటిల్‌దే ఉంటుందని మండిపడ్డారు. నాయకులను కొంటారు కానీ కార్యకర్తలను కొనలేరని ఆయన తెలిపారు.

"కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్​ బ్రోకర్లు పార్టీని వీడిచిపోతున్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అవుతుంది. పార్టీలోంచి వెళ్లిపోయిన వారు, రేపు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించింది. మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్లు పార్టీలోంచి వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్​కు కార్యకర్తలు బలం ఎల్లప్పుడూ ఉంటుంది". - హరీశ్​రావు, మాజీమంత్రి

రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు: హరీశ్‌రావు

కాంగ్రెస్​కు రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టవు : హరీశ్​ రావు

హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీశ్‌రావు

Last Updated : Mar 29, 2024, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details