తెలంగాణ

telangana

మద్యానికి బానిసైన కొడుకును హత మార్చిన తండ్రి - ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 10:45 PM IST

Father Kills Son In Shamirpet : మద్యానికి బానిసై డబ్బుల కోసం నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో ఓ తండ్రి తన కన్న కొడుకునే హత్య చేశాడు. ఈ ఘటన షామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మరోవైపు సూర్యాపేట జిల్లాలో ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భార్యనే హతమార్చింది భార్య.

Woman Kills Husband In Suryapet District
Father Kills Son In Shamirpet

Father Kills Son In Shamirpet : రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. కన్న కొడుకును ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రే కొడుకును హత్యచేశాడు. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కన్నతండ్రి కొడుకుని హత్య (Father Kills Son) చేసిన ఘటన షామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం షామీర్​పేట మండలంలోని లాల్ గడి గ్రామంలో రామ్ చందర్, మంజుల కుమారుడు కొరివి నరేష్(28) వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

గ్రామానికి చెందిన కొరివి నరేశ్​ ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి కనిపించట్లేదని 22వ తేదీన తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా తన తండ్రి రామచందర్ కన్న కొడుకును హత్య చేశాడని నిర్ధారించారు. మద్యానికి బానిసై డబ్బుల కోసం నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో హత్యచేశానని పోలీసు విచారణలో తండ్రి ఒప్పుకున్నాడు.

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమారుడికి మద్యం తాగించి రూ.10 వేలు ఇస్తానని గ్రామ సమీపంలో ఉన్న ఓ బావి దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ కుమారుడు నరేశ్​​కు ఫుల్​గా మద్యం తాగించి అనంతరం బావిలో తోసేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కొడుకు కనబడటం లేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. భయంతో తల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు తండ్రి రామ్​చందర్​పై అనుమానం వచ్చి విచారించడంతో తానే చంపానని తెలిపాడు. మృతుడు నరేశ్​​కి వివాహమై ఏడాదిన్నర పాప ఉంది.

Woman Kills Husband In Suryapet : మరోవైపు సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన వీర గోపయ్య, కుమారి జీవనం సాగిస్తున్నారు. భర్త దివ్యాంగుడు కావడంతో వేరే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ బంధానికి అడ్డువస్తున్నాడని చెప్పి ప్రియుడితో కలిసి భార్య వీర గోపయ్యను హతమార్చింది(Woman Kills Husband). బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకొని, దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సినిమాను తలపించేలా హత్య - వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన భార్య

Wife Killed Husband Using Snake : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త.. ఊపిరాడకుండ చేసి.. ఆపై పాముకాటుతో హత్య చేయించిన భార్య

ABOUT THE AUTHOR

...view details