ETV Bharat / bharat

భర్తను చంపిన భార్య.. ఐదు రోజులు ఇంట్లోనే మృతదేహం.. దుర్వాసన ఏంటని అడిగితే..

author img

By

Published : Mar 10, 2023, 7:16 PM IST

wife kills husband
భర్తను చంపిన భార్య

భర్తను హత్య చేసింది ఓ భార్య. అనంతరం భర్త మృతదేహాన్ని ఐదు రోజులు ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితురాలి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

ఝార్ఖండ్​లోని జంషెద్​పుర్​లో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అనంతరం భర్త మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడం వల్ల స్థానికులు.. ఉలిదిహ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిని పోలీసు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని ఇలిదిహ్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాశ్ కాలనీకి చెందిన అమర్​నాథ్​​ సింగ్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అమర్​నాథ్​ సింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆయన భార్య మీరా మానసిక స్థితి సరిగా లేదు. అమర్​నాథ్​, మీరాకు తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో చాలా సార్లు మీరా.. ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేసేది. అయితే ఇటీవల అమర్ ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో స్థానికులు అమర్​నాథ్ ఇంటికి వెళ్లారు. అమర్ గురించి అతడి భార్య మీరాను ప్రశ్నించారు. అయితే మీరా.. ఇరుగుపొరుగు వారికి సరైన జవాబు చెప్పలేదు. అమర్​ గురించి అడిగిన వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన స్థానికులు పుణెలో ఉంటున్న అమర్​నాథ్​ కుమారుడికి ఫోన్​లో విషయం తెలియజేశారు. ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి రాకుండా మీరా ఇంటి కంచెకు కరెంట్ పెట్టింది.

కాగా.. స్థానికులు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్ కనెక్షన్‌ తప్పించి అమర్​నాథ్​ సింగ్ ఇంట్లోకి వెళ్లారు. ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. అంతలో అమర్ సింగ్ కుమారుడు ఉల్​దిహ్​ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితురాలు మీరాను అదుపులోకి తీసుకున్నారు. అమర్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

wife kills husband
మృతుడు అమర్​నాథ్ సింగ్

'గత నాలుగైదు రోజులుగా అమర్​నాథ్ సింగ్ కనిపించట్లేదు. ఆయన ఇంటి నుంచి దుర్వాసన వచ్చింది. అమర్​నాథ్ ఇంటికి వెళ్లేసరికి ఆయన భార్య మాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అందుకే అనుమానం వచ్చి పుణెలో ఉన్న అమర్​నాథ్ కుమారుడికి ఈ విషయం తెలియజేశాం. మీరా మానసిక స్థితి సరిగా లేదు. ప్రతి రోజు ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేస్తుంది. తరచూ భర్తతో గొడవపడేది.' అని స్థానికుడు ఒకరు తెలిపారు. అమర్​నాథ్​ మృతిపై విచారం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.