ETV Bharat / state

సినిమాను తలపించేలా హత్య - వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన భార్య

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 7:43 AM IST

Jawahar Nagar Murder Case In Siddipet : ప్రియుడి కోసం బంగారం విక్రయించింది. అతని జల్సాల కోసం లోన్‌ యాప్‌లో రుణాలు తీసుకుంది. అడ్డు వస్తున్న భర్తను హతమార్చేందుకు గూగూల్‌ పేలో డబ్బు పంపింది. జవహర్​నగర్​లో కలకలం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు కారణం వివాహేతర సంబంధమేనని తేల్చారు. సినిమాను తలపించేలా నిందితుల హత్యోదంతం చూసి పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు.

Jawahar Nagar Murder Case In Siddipet
Jawahar Nagar Murder Case

Jawahar Nagar Murder Case In Siddipet : సిద్దిపేట జిల్లాకు చెందిన సందిరి స్వామి ఎనిమిదేళ్ల క్రితం బంధువు కుమార్తె కావ్యను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధి బాలాజీనగర్​లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్వామి స్థానికంగా ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న ప్రణయ్ కుమార్‌తో కావ్యకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఏడాది కాలంగా ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు - డబ్బు పంచాయితీలో తండ్రి, మేనమామను చంపిన యువకుడు

Jawahar Nagar Murder Case : క్యాబ్ డ్రైవర్​గా పని చేస్తున్న ప్రణయ్‌ కుమార్ ఇదే అవకాశంగా భావించి, ఆమె వద్ద డబ్బు తీసుకోవడం ప్రారంభించాడు. తొలుత తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అమ్మి అతనికి డబ్బు సమకూర్చింది. మరోసారి రూ.5 లక్షల నగదు ఇచ్చింది. అయినా మరికొంత డబ్బు కావాలని అడగడంతో రూ.3 లక్షలు పిరమిల్ అనే లోన్‌యాప్‌లో రుణం తీసుకుని ఇచ్చింది. విడతల వారీగా రూ.10 లక్షలు సమకూర్చింది. ఆమె ఇచ్చిన డబ్బుతో ప్రణయ్ జల్సాలు చేసేవాడు. ఇద్దరి అక్రమ సంబంధంపై భర్త స్వామికి అనుమానం రావడంతో కావ్యను మందలించాడు. పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఆ విషయాన్ని కావ్య ప్రణయ్‌తో చెప్పింది. స్వామిని అడ్డు తొలగిస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని కావ్య తెలిపింది. దీంతో అతన్ని హత్య చేసేందుకు పథకం వేశారు.

Siddipet Murder : హత్య చేసేందుకు ప్రణయ్ కుమార్ అతని స్నేహితుల సహాయన్ని కోరాడు. నిజామాబాద్​కు చెందిన రోహిత్‌, జవహర్​నగర్​కు చెందిన నగేశ్​ లకు విషయం చెప్పాడు. జనవరి 26న స్నేహితులతో కలిసి అనంతపూర్ విహార యాత్రకు వెళ్తున్నామని స్వామికి తెలిపాడు. తమ కారుకు డ్రైవర్‌గా వస్తే రోజు కూలీ ఇస్తామని తెలపగా స్వామి అంగీకరించాడు. ప్రణయ్, స్వామిని తీసుకుని వెళ్లి స్నేహితులతో కలిసి చంపేశాడని పోలీసులు తెలిపారు.

Wife Killed Husband In Siddipet : గత నెల 28న తూముకుంట నుంచి జవహర్​నగర్​కు వెళ్తున్న సమయంలో అటవీ ప్రాంతంలో శవం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో పాటు, సాంకేతికత సాయంతో ప్రధాన నిందితుడు ప్రణయ్, రోహిత్‌, నగేశ్‌లను అరెస్టు చేశారు. మృతుని భార్య కావ్య పరారీలో ఉంది. నిందితుల నుంచి కారు, నాలుగు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు.

సినిమాను తలపించేలా హత్య - వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తని చంపిన భార్య

Wife Killed Husband Using Snake : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త.. ఊపిరాడకుండ చేసి.. ఆపై పాముకాటుతో హత్య చేయించిన భార్య

Constable Committed Suicide After killing his Family: రెండో భార్య పేరిట ఆస్తులు.. మొదటి భార్య, ఇద్దరు పిల్లలను తుపాకితో కాల్చిచంపి.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.