తెలంగాణ

telangana

ప్రకృతి సేద్యంతో పండించిన భోజనం అందిస్తున్న అన్నదమ్ములు - brothers Organic Farming

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 2:41 PM IST

Engineering brothers Organic Farming : సమాజంలో ఏదైనా విషయం చెప్తే ఎవరు నమ్ముతారని భావించారు ఆ అన్నదమ్ములు. చేసి చూపిస్తేగాని ఎవరూ నమ్మరని అనుకున్నారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఆహారం తింటే ఎంతో ఆరోగ్యమని బలంగా నమ్మారు. దాంతో 45 రోజుల పాటు సొంత ఊర్లో 60 మందిని ఎంచుకొని ఉచితంగా 3 పూటలు ప్రకృతి సేద్యంతో పండించి భోజనం అందించారు. క్రమంగా మంచి ఫలితాలు అందుకున్నారు. ఊరికి ఉపకారం చేయడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలు దూరం చేశారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో హైదరాబాద్‌లో స్థిరపడి సొంత గ్రామంలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన అన్నదమ్ములపై కథనం.

Engineering Students Serving Organically Grown Meals
Engineering brothers Organic Farming

Engineering brothers Organic Farming in Mahabubnagar: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్ గోడు గ్రామానికి చెందిన శశిధర్, రాజశేఖర్ ఇద్దరూ అన్నదమ్ములు. అమెరికాలో ఉద్యోగాలు చేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐటీ రంగంలో స్థిరపడ్డారు. సొంత గ్రామానికి వచ్చినప్పుడల్లా ప్రకృతి వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. కాగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులు తమ ఆరోగ్యాలు బాగుపడేందుకు ఏదైనా సాయం చేయమని వారిని అడిగే వాళ్లు. గో ఆధారిత సాగుతో పండించిన ఆహారాన్ని తినడమే అందుకు పరిష్కారమని అన్నదమ్ములు భావించారు.

Engineering Students Serving Organically Grown Meals : అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టాలనుకొని 45 రోజుల పాటు తామే 3 పూటల ఉచిత ఆహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 8న మంధన్ గోడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 60 మందిని ఎంపిక చేసి సొంతింటి వద్దే భోజనశాల ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వారికి 3 పూటల ఉచితంగా ఆహారాన్ని అందించారు. ఉదయం అంబలి, మధ్యాహ్నం బహురూపి, నవారా, కాలాబట్టి బియ్యంతో అన్నం, సాయంత్రం ఉప్మాలాంటి అల్పాహారం ఇచ్చారు. ఆ ఆహారాన్ని తినడం వల్ల మధుమేహం, రక్తపోటు, కీళ్లనొప్పుులు, అధిక బరువు లాంటివి అదుపులోకి వచ్చాయని ఎలాంటి రుగ్మతలు లేకుండా సంతోషంగా ఉన్నామని గ్రామస్థులు చెబుతున్నారు. పూర్తిగా ప్రకృతి సేద్యంతో తయారు చేసిన కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ఇతర దినుసులు వాడారు.

TS Agros Make Soil programme: ఇంట్లోనే సేంద్రీయ ఎరువు తయారీ.. ఎలాగో నేర్చుకోండి..

Organic Farming in Narayanpet :ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహా కర్ణాటక నుంచి సరుకులు తెప్పించారు. మంచినీళ్లు కూడా ఫిల్టర్ నీళ్లు వాడకుండా బోరుబావి నుంచి తీసిన నీళ్లను వాడారు. ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించారు. అలా 45 రోజుల పాటు దిగ్విజయంగా ఉచిత భోజనాన్ని అందించారు. 45 రోజులు ప్రకృతి సిద్ధ ఆహారాన్ని తీసుకున్న వాళ్లు ఆ తర్వాత కొనసాగించకపోతే కష్టమని భావించి వాటిని ఎలా వండుకోవాలో కూడా నేర్పించారు. బియ్యం, కూరగాయలు, పప్పులు, దినుసులు ఎక్కడ దొరుకుతాయో సమాచారం అందించారు. దీంతో తాము 45 రోజులకు మాత్రమే పరిమితం కాకుండా కొనసాగిస్తామని, పిల్లలకూ ఇదే ఆహారాన్ని వండిపెడతామని గ్రామస్తులు అంటున్నారు.

గో ఆధారిత సాగు ద్వారా పండించిన ఆహారాన్ని తినడం వల్ల రోగాలు దరిచేరవనే అవగాహన ప్రజల్లో పెంచడమే తమ అసలు లక్ష్యమని శశిధర్, రాజశేఖర్ తెలిపారు. తమలా ప్రతి గ్రామంలో ఉచిత భోజనశాలలు, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ప్రకృతి వ్యసాయంపై అవగాహన ఏర్పడుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 45 రోజుల కార్యక్రమం తర్వాత ప్రకృతి సిద్ధంగా రసాయనాలు లేకుండా పంటలు పండించేందుకు కొంతమంది రైతులు ముందుకు వచ్చారు. సాధారణ భోజనం కాకుండా దేశవాళీ రకాల బియ్యం, కూరగాయలు, ఆకుకూరలతో చేసిన భోజనమే చేసేందుకు అందరూ ఇష్టపడుతున్నారు.

చిరుధాన్యాల ఉత్పత్తి కోసం ఆహార సార్వభౌమత్వం కార్యక్రమం - ప్రభుత్వానికి 10 డిమాండ్లతో తీర్మానం

Young Woman Quit Her Job And Started Organic Store : చదువుకున్నది ఆర్కిటెక్ట్​.. చేస్తున్నది ఆర్గానిక్​ వస్తువుల వ్యాపారం

ABOUT THE AUTHOR

...view details