ETV Bharat / state

Young Woman Quit Her Job And Started Organic Store : చదువుకున్నది ఆర్కిటెక్ట్​.. చేస్తున్నది ఆర్గానిక్​ వస్తువుల వ్యాపారం

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 4:33 PM IST

Young Woman Runs Zero waste Store
Young Woman Quit Her Job And Started Organic Store

Young Woman Quit Her Job And Started Organic Store In Warangal : రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో హనికరం. ఇక ప్లాస్టిక్ విషయానికొస్తే అది మనం ఆరోగ్యంతోపాటు.. పర్యావరణానికి హాని చేస్తుంది. దీంతో మానవ జీవన ప్రమాణ రేటు నానాటికీ తగ్గిపోతుంది. అయినా.. ప్లాస్టిక్ వినియోగం, రసాయనల వాడకం మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని అనుకుంది.. ఆ యువతి. అందుకోసం జీరోవేస్ట్ పద్ధతిలో సాగు చేసిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా అందిస్తోంది. అంతేనా, అందుకోసం ఎక్కడ ప్లాస్టిక్‌ అనే భూతాన్ని దరిచేరనీయడం లేదు. మరి, ఆ ఆర్గానిక్‌ అండ్‌ ప్లాస్టిక్‌ ఫ్రీ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Young Woman Quit Her Job And Started Organic Store చదువుకున్నది ఆర్కిటెక్ట్​ చేస్తున్నది ఆర్గానిక్​ వస్తువుల వ్యాపారం

Young Woman Quit Her Job And Started Organic Store In Warangal : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.. పెద్దలు. మరి, అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా, వ్యాయమాలు అంటూ నిత్యం శ్రమిస్తూనే ఉంటాము. కానీ, మనం తినే ఆహారం మీద మాత్రం అస్సలు దృష్టే పెట్టము. అయితే, వీటి బారినుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుంటాము. అలాంటి వారికోసం నేనున్నాను అంటూ ఈ యువతి ఒక ఆర్గానిక్‌ స్టోర్‌(Organic Store) ప్రారంభించింది. ఎక్కడా ప్లాస్టిక్‌ వినియోగించకుండా పూర్తి జీరో వేస్టేజ్‌తో ఆహార పదార్థాలను వినియోగదారులకు అందిస్తోంది.

ఈ యువతి పేరు స్వాతి. ఈమె ఒక ఆర్కిటెక్ట్. కొన్ని రోజుల పాటు ఇంటీరియర్‌ డిజైనర్‌గా వృత్తి చేసింది. అయినా, తనకెంతో ఇష్టమైన ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ను మాత్రం మరిచిపోలేకపోయింది. దీంతో ఉద్యోగం మానేసి మరి, సేంద్రీయ వ్యవసాయంపై మక్కువ పెంచుకుంది. దాని మీద బాగా అవగాహన కూడా ఉండటంతో.. నగరంలో ఒక దుకాణాన్ని ప్రారంభించి 'జీరో వేస్ట్'(Zero Waste) నినాదంతో వ్యాపారం చేస్తోంది.

Young Woman Runs Zero waste Store : ఈ యువతి హనుమకొండ జిల్లా ఐనవోలు వద్ద 15 ఎకరాల్లో క్రిమి సంహారక మందులు వాడకుండా సేంద్రీయ సాగు మొదలు పెట్టింది. అలాగే ఇక్కడ పండించిన ఆహార పదార్ధాలను నేరుగా స్టోర్‌గా తీసుకొచ్చి విక్రయిస్తోంది. కానీ, ఎక్కువ మందికి అందించలేకపోయింది. దీంతో ఎలాగైనా దీనిని మరింత మందికి చేరువ చేయాలని అనుకుంది. అందుకోసం మహారాష్ట్ర కొల్హాపూర్ ప్రాంతంలో మహిళలు పండించిన సేంద్రియ పంటలనీ ఇక్కడకు తీసుకొచ్చి స్వాతి విక్రయిస్తుంది.

ఓ వైపు బిజినెస్​.. మరోవైపు వ్యవసాయం.. రెండిట్లో రాణిస్తున్న యువ జంట

అన్ని వస్తువులు సేంద్రీయంగా లభిస్తాయి : ఈ స్టోర్‌లో నూనెలు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, మసాల పొడి మెుదలు ప్రతిదీ సేంద్రీయ పద్ధతిలో పండించినవే లభిస్తాయి. పెద్దలకే కాకుండా చిన్నారులు ఇష్టపడే పాస్తా, నూడుల్స్, క్యాండీ వంటి చిరుతిళ్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. అయితే, వీటిలో మైదా వాడకుండా తయారు చేసినవే ఉండటం విశేషం. అయితే, ఈ ఉత్పత్తులన్ని కూడా రసాయనాలు వాడకుండా, సేంద్రియ పద్ధతిలో పండించినవి కావడం గమనార్హం.

Organic Farming Awareness In Warangal : ఆర్గానిక్ ఉత్పత్తులపై ఇష్టం ఉన్న కొనుగోలుదార్లకు.. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌పై కూడా స్వాతి అవగాహన కల్పిస్తోంది. ఇక్కడికి వచ్చే వారంతా ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా మట్టిపాత్రలు, గాజు, స్టీల్‌ పాత్రలు మాత్రమే వినియోగించేలా అందరిలో చైతన్యం కూడా కల్పిస్తోంది. ఈ స్టోర్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి చేతితో అల్లిన వెదురు గంపలలో అందించడం స్పెషాలిటీ. దీంతో, క్రమంగా స్టోర్‌కి వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని ఆమె చెబుతోంది.

"ఈ "సైకిల్​ కథే వేరు.. హైదరాబాద్ కుర్రాళ్ల అద్బుత సృష్టి

"ఆలేరులో ఆర్గానిక్​ ఫార్మింగ్​ చేసే వాళ్లము. గతంలో చిన్నగా ప్రారంభించిన వ్యాపారం.. రోజు రోజుకూ విస్తరిస్తూ వచ్చాను. మా దగ్గర 700 పైచిలుకు ఆర్గానిక్​ పదార్థాలు కలవు. మా దగ్గర ఎక్కువగా అమ్ముడయ్యేవి పిల్లల బలానికి, ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలు. ఎక్కువగా కాలేజీ విద్యార్థులు సేల్​ చేస్తున్నారు. జీరో ప్లాస్టిక్​ స్టోర్​ మాది. చిరు తిండ్లు నుంచి అన్ని పదార్థాలు మా దగ్గర లభ్యమవుతాయి. గ్లాస్​ బాటిల్స్​, పేపర్​ పేట్లు, పేపర్​ కవర్స్​ వంటివి తమ దగ్గరు ఉంటాయి." - స్వాతి, స్టోర్​ వ్యవస్థాపకరాలు

Architect Started Zero waste Store In Warangal : స్వాతి చేస్తున్న వ్యాపారంకు తన సోదరుడు సిద్ధార్థ్‌ కూడా సాయం చేస్తున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వారు నేరుగా తమ స్టోర్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని సిద్ధార్థ్‌ అంటున్నాడు. ముఖ్యంగా ఆరోగ్యానికి ఆవసరమైన ఎన్నో రకాల ఆహార పదార్థాలను ఇక్కడ విక్రయిస్తున్నట్లు ఆయన చెబుతున్నాడు. ఈ రోజుల్లో మనం వాడే పదార్థాలే మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఆడవాళ్లు వంటింట్లో వాడే నూనెలు నాసిరకం కాకుండా గానుగ నూనెలు వాడితే గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చు. అందుకే మనం ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తామో.. పర్యావరణం పట్ల అంతే అవగాహన కలిగి ఉండాలనేదే తమ ఉద్దేశమని స్వాతి అంటోంది.

Graduate Vegetables Farming In Jagityala : ఉద్యోగం వదిలేశాడు.. కూరగాయల సాగులో లక్షలు సంపాదిస్తున్నాడు

Masti Goli Soda in Karimnagar : సాఫ్ట్‌వేర్​ జాబ్​ విడిచి.. గోలీ సోడాతో హిట్​ కొట్టాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.