"ఈ "సైకిల్​ కథే వేరు.. హైదరాబాద్ కుర్రాళ్ల అద్బుత సృష్టి

By

Published : Apr 1, 2023, 4:43 PM IST

thumbnail

Electric bicycles in Hyderabad: సైకిల్‌.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో దీనిని వినియోగించే వారి సంఖ్య చాలా తగ్గింది. కానీ, రోజులు మారాయి.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్న చందంగా పర్యావరణం, ఆరోగ్యంపై అవగాహనతో సైకిళ్లపై తిరిగి మనుసుపారేసుకుంటున్న యువత పెరుగుతున్నారు. వీటిని మాములు సైకిల్‌ లాగా తొక్కడానికి ఉపయోగించవచ్చు. అదే అలసిపోతే ఎలక్ట్రిక్ వెహికిల్​లాగా వాడుకోవచ్చు. మన అవసరం, అభిరుచికి అనుగుణంగా వినియోగించుకోవచ్చు. అదే ఆలోచనతో గేర్ హెడ్ మోటార్స్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన నిఖిల్, సాయి మహేర్ కృష్ణ అనే యువకులు ... ఎలక్ట్రిక్​ సైకిల్ తయారీ సంస్థను ప్రారంభించారు.

 పలు మోడల్స్‌లో ఎలక్ట్రిక్ సైకిళ్లను విపణిలోకి తీసుకోచ్చారు. పర్యావరణానికి తమ వంతు సాయంగా చేద్దామని ఈవీ సైకిళ్లను తయారు చేశామని ఆ యువకులు చెబుతున్నారు . వారి సైకిళ్లు ఇప్పుడు బెంగళూరు, దిల్లీతో సహా శ్రీలంక, లండన్, నేపాల్,  తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో తమ ఎలక్ట్రిక్​ సైకిళ్లను మరిన్ని దేశాలకు ఎగుమతి చేస్తామని చెబుతున్న గేర్ హెడ్ మోటార్స్ నిర్వహకుడు సాయి మహేర్‌ కృష్ణతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.