తెలంగాణ

telangana

మళ్లీ నగరబాట పట్టిన ఓటర్లు, రద్దీగా మారిన హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి - huge traffic at pantangi tollplaza

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 8:41 PM IST

Huge Traffic at Pantangi Tollplaza : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ ముగిసింది. ఓటర్లు సొంతూళ్లు వదిలి పట్నం బాట పట్టారు. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన ఓటర్లతో విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది.

Vehicle Rush at Vijayawada Highway
Huge Traffic at Pantangi Tollplaza (ETV Bharat)

నగరబాట పట్టిన ఓటర్లు- రద్దీగా మారిన విజయవాడ జాతీయ రహదారి (ETV BHARAT)

Vehicle Rush at Vijayawada Highway : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెలరోజులుగా నెలకొన్న ఎన్నికల సందడి ముగిసింది. ఓట్ల కోసం స్వగ్రామాలకు వెళ్లిన ఓటర్లు తిరిగి రాజధాని బాట పట్టారు. తిరుగు ప్రయాణమైన ఓటర్ల వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది. వందలాది వాహనాలు బారులు తీరి వెళుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది. అర కిలోమీటర్ వరకు వాహనాలు స్తంభించిపోయాయి. వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. టోల్‌గేట్‌ దాటడానికి 15 నిమిషాలు పడుతోంది. 16 గేట్లగాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలను పంపిస్తున్నారు.

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది. చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదయ్యింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణంతో కంటోన్మెంట్‌ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈపోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 47.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రణరంగంగా మారాయి. పలు చోట్ల తీవ్రస్థాయిలో ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

ABOUT THE AUTHOR

...view details