తెలంగాణ

telangana

ఆ రాశివారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు! శివాష్టకం పఠిస్తే మంచి ఫలితాలు! - Horoscope Today May 4th 2024

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 5:01 AM IST

Horoscope Today May 4th 2024 : మే​ 4న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 4th 2024
Horoscope Today May 4th 2024 (Etv Bharat)

Horoscope Today May 4th 2024 : మే​ 4న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ఈ రాశి వారు అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందగలరు. సమాజంలో మీ గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. వ్యాపారులకు వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. మంచి లాభాలను అందుకుంటారు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్న వారికి శుభసమయం ఆసన్నమయింది. అన్ని రంగాల వారు అభివృద్ధి బాటలో పయనిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అద్బుతమైన రోజు. వ్యాపారులు ఈ రోజు విపరీతమైన లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఉద్యోగులకు రుణ విమోచనం, కార్య జయం ఉంటుంది. మీ పనికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇది మీకు పేరు, ప్రఖ్యాతలతో పాటు సమాజంలో గుర్తింపును తీసుకువస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా ఈ రాశి వారు నేడు చూడబోతున్నారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సామరస్యంగా ఉంటే మేలు. వివాదాలకు పోకుండా రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారులు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మేలు. ఆరోగ్యం సహకరిస్తుంది. స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలమైన సమయం. శివారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. మీ కుటుంబ గౌరవానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయవద్దు. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు అప్పులు పెరగకుండా చూసుకోండి. విద్యార్థులకు విదేశీయాన యోగం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా కూడా సంతోషంగా ఉంటారు. బందు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. మొదలు పెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. సహనంతో, సమయానుకూలంగా వ్యవహరిస్తే మేలు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజు. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వ్యాపారులు భాగస్వాముల నుంచి ప్రయోజనాలను పొందవచ్చు. పలు రకాల ఆర్థిక ప్రయోజనాలను ఈ రోజు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజంతా విందు వినోదాలతో సంతోషంగా గడుపుతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక, స్థిరాస్తి పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. నూతన అవకాశాలను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఒక మహిళ కారణంగా మీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. కోపం, పట్టుదల తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభఫలితాలను ఇస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడి కారణంగా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి సమయం. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన ప్రశాంతతను ఇస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మితిమీరిన చాదస్తం ధోరణితో ఉండకండి. ఈ ధోరణి మీ పనులకు ఆటంకంగా మారుతుంది. సర్దుబాటు గుణం పెంచుకోండి. పని ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళతారు. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. భవిష్యత్ కోసం పొదుపు ప్రణాళికలు వేసుకోండి. ఈశ్వరుడిని ఆరాధిస్తే మనోబలం పెరుగుతుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయండి. వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించండి. అన్నింటిలోనూ మీరు విజయాన్ని అందుకుంటారు. శ్రమకు తగిన ఫలం ఉంటుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంతో సరదాగా గడపండి. ఆదాయానికి లోటుండదు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపడం వలన చాలా సంతృప్తికరంగా, సంతోషంగా ఉంటారు. ప్రతికూల ఆలోచనలను వీడండి. దైవబలం అండగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే విజయం మీదే! ఉద్యోగులకు ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. శని శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజు మంచి ఫలితాలను పొందడానికి మీ శక్తి యుక్తులను పూర్తిగా వినియోగించాలి. సానుకూల ధోరణితో ఉండండి. ధ్యానం, యోగా సాధన చేయడం ద్వారా ఇది సాధ్యం. మీ కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. గణపతి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details