తెలంగాణ

telangana

ఈరోజు ఆ రెండు రాశుల వారికి అనుకూలంగా లేదు- ఖర్చులను అదుపులో ఉంచుకోండి! - Daily Horoscope

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 4:44 AM IST

Horoscope Today May 13th 2024 : మే​ 13న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

Horoscope Today May 13th 2024 : మే​ 13న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు మీరు అంతర్గత సంఘర్షణకు లోనవుతారు. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం ఒక సవాలుగా ఉంటుంది. మీ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. శివారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనేక రకాల ఆందోళన, ఒత్తిళ్లు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆందోళన చెందవద్దు. అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఉద్యోగులు దూరప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీవ్రమైన పని ఒత్తిడితో అలిసిపోతారు. అయినా పని నుంచి విశ్రాంతి కోరుకోరు. మీ వైఖరితో మీ సహోద్యోగులను కూడా ఉత్సాహపరుస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో చేసిన పొదుపు నిల్వలు తరిగిపోకుండా చూసుకోండి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. గణపతి ధ్యానం శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది. చిన్ననాటి స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులకు రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రతికూల ఆలోచనలతో అశాంతిగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్ధిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటే మేలు. మొహమాటాలకు పోయి చిక్కుల్లో పడతారు. ఎవరికీ హామీ ఉండడటం కానీ, సాక్షి సంతకాలు చేయడం కానీ చేయవద్దు. శివారాధనతో ఆపదల నుంచి గట్టెక్కుతారు.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభఘడియలు వచ్చేసాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు సరదాగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో, ఆఫీస్లో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కలిసివచ్చే కాలం. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఉండవచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు చేసుకోడానికి, పెట్టుబడులు పెట్టడానికి శుభసమయం. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యులతో కలహాలకు ఆస్కారం ఉంది. ఆదిత్య హృదయం పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మానసికంగా, శారీరకంగా అలిసి పోయారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ పిల్లల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. అనుకోని ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. ప్రశాంతంగా ఉండండి. అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. శనిస్త్రోతం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఊహించని సంఘటనలు, ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆర్ధికంగా నష్టపోతారు. సున్నిత సమస్యల పట్ల చూసీచూడనట్లు ఉంటే మంచిది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు, గౌరవప్రదంగా లౌక్యంగా ఉండండి. శివాష్టకం పఠిస్తే ఆపదలు తొలగుతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తివ్యాపారాల వారు తలపెట్టిన ప్రతి పనిలో రాణిస్తారు. అందరికీ విశ్వాసపాత్రంగా ఉంటారు. సమాజంలో మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. గతంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించగలరు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నీ కలిసి ఓ గొప్ప రోజుగా ఈ రోజు ఉండనుంది. శ్రీలక్ష్మి అష్టోత్తరం పఠిస్తే శుభం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు విజయాన్ని చూస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఈ రోజు శుభసూచకంగా ఉంది. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఇంట్లో శుభకార్యాలు, పూజలు వంటివి జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. గణపతి షోడశ నామాలు ప్రతినిత్యం జపిస్తే ఆటంకాలు తొలగుతాయి.

ABOUT THE AUTHOR

...view details