తెలంగాణ

telangana

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Polls 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 10:03 AM IST

Political Parties Speed Up Election Campaign 2024 : లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఊరూరా తిరుగుతున్న అభ్యర్థులు తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

Political Parties Speed Up Election Campaign
Political Parties Speed Up Election Campaign

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు

Political Parties Speed Up Election Campaign 2024 :15లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం కొనసాగిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్యకార్యకర్తలు సమావేశంలో(Meeting) ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్‌(Government) దోపిడీకి పాల్పడిందన్న ఆయన కాంగ్రెస్‌ సర్కార్‌ హయాంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు.

అత్యధిక మెజార్టీయే లక్ష్యం :వరంగల్‌ ఎంపీగా కడియం కావ్యనుఅత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లిలో నిర్వహించిన వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Polls) సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హనుమకొండలోని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రి రాజయ్యపై తీవ్రస్థాయిలోమండిపడ్డాడు.

తెలంగాణ గళం బలం బీఆర్ఎస్ నినాదంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. వరంగల్ జిల్లా మణికొండలో నిర్వహించిన స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ పాల్గొన్నారు. కడియం శ్రీహరికి రాజకీయ విలువలుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - ప్రచార వేగం పెంచిన పార్టీలు - LOK sabha Polls 2024

BRS Election Campaign In Telangana : కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చిన మూడునెలల్లో అభివృద్ధి(Development) కుంటుపడిందని నారాయణపేట జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జిల్లా మంథనిలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. ఖమ్మంలోని మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నివాసంలో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామనాగేశ్వరరావు పాల్గొన్నారు.

BJP Election Campaign In Telangana : బీజేపీ సైతం రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ప్రచారం నిర్వహిస్తోంది. అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న. మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు స్వామివారి పాదాల ముందు తన నామినేషన్(Nomination) పత్రాలను పెట్టి పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని చాయ్‌ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్‌ బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.

హెటిరో సంస్థకు ఇచ్చిన భూమిపై బీజేపీ ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానికులను కలిసి ఓటువేయాలని అభ్యర్థించారు.

రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్​ హీట్​ - నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు - LOK SABHA ELECTION 2024

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details