తెలంగాణ

telangana

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్​ కసరత్తులు - ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాలు షురూ - Lok Sabha Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 8:40 PM IST

BRS Lok Sabha Election Campaign 2024 : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్​ కసరత్తులు ముమ్మరం చేసింది. లోక్‌సభ నియోజకవర్గ సమావేశాలతో నేతలు, శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశాలు, ఎండిన పంటల పరిశీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న గులాబీ​ నేతలు, గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటూ కార్యకర్తలు, అభ్యర్థులకు దిశానిర్థేశం చేస్తున్నారు.

2024 Lok Sabha Election
BRS Meetings Part of Lok Sabha Election Exercise

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్​ కసరత్తులు - ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాలు షురూ

BRS Lok Sabha Election Campaign 2024 : ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోవటం, ఇతర పార్టీల్లోకి నేతల వలసలతో సతమతమవుతున్న బీఆర్​ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేలా సన్నాహాలు ముమ్మరం చేసింది. విస్తృత సమావేశాలతో నాయకులు, శ్రేణుల్ని ఎన్నికలకు సమాయాత్తం చేస్తోంది. ఇందులో భాగంగానే నల్గొండలో నిర్వహించిన లోక్‌సభ నియోజకవర్గ(Lok Sabha Constituency) బీఆర్​ఎస్​ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రెండు లక్షల రుణమాఫీ, ఇప్పటి వరకు ఎందుకు ఆమలు చేయలేదని ప్రశ్నించారు.

"ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఎవరూ కూల్చాల్సిన పని లేదు- ఆ జిల్లా నాయకులే చాలు" - LOK SABHA ELECTIONS 2024

"రేవంత్​ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యినవెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానంటూ, బ్యాంకుల్లో లోన్​ తీసుకోని వారు ఎవరైనా ఉంటే, వెళ్లి తీసుకోండి డిసెంబర్​ 09న నేను చేస్తా రుణమాఫీ అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడేమో అవే బ్యాంకులు రుణమాఫీ జరగలేదంటూ, లోన్​లు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు పంపించి, ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చింది."-కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

BRS Meeting Part of Lok Sabha Election Exercise :నల్గొండలో బీఆర్​ఎస్​ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మండలంలోని ముషంపల్లి గ్రామంలో పర్యటించిన కేటీఆర్‌, ఎండిన పంట పొలాలను పరిశీలించారు. తమను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకున్న రైతు మల్లయ్యను ఓదార్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అన్నదాతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పర్యటనకు(KCR Tour) వస్తున్నారని భయపడి గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీళ్లు వదిలిరారన్న కేటీఆర్‌, కాంగ్రెస్ 100 రోజుల పాలనలో కరవు తాండవిస్తోందని వ్యాఖ్యానించారు.

Harish Rao Attend BRS Meeting in Warangal :వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని నిర్వహించిన బీఆర్​ఎస్​ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందన్నారు. టికెట్‌ ఇచ్చినా కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. నిజంగా కడియం శ్రీహరికి నీతి నిజాయితీ ఉంటే, మీరెప్పుడు రాజకీయ నైతిక విలువలు గురించి మాట్లాడుతారు. అవి నిజమైతే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని తాను డిమాండ్​ చేస్తున్నట్లు హరీశ్​రావు పేర్కొన్నారు.

కడియం బీఆర్​ఎస్​ నుంచి వెళ్లాక పార్టీలో జోష్​ కనిపించింది : హరీశ్‌ రావు - BRS Harish Rao Comments on Congress

"నిజంగా కడియం శ్రీహరి పార్టీ నుంచి వైదొలిగినాక, బీఆర్​ఎస్​లో జోష్​ ఎక్కువగా కనిపిస్తుంది. కసి అంతకంటే ఎక్కువ కనిపిస్తుంది. ఇవాళ పార్టీకి ద్రోహం చేశారు. అటువంటి నాయకుడుకు గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి, ప్రతీ కార్యకర్తలోనూ కనిపిస్తుంది. ఆయన పార్టీ టిక్కెట్​ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టి, మరి చివరి క్షణంలో పార్టీ మారడం అంటే ద్రోహం కాదా?"-హరీశ్‌రావు , మాజీమంత్రి

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో నిర్వహించిన బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌ పాల్గొన్నారు. తనను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కుట్రల్లో భాగంగానే కవితను(MLC Kavitha Arrest) అరెస్టు చేశారని, కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

'ప్రకృతి తెచ్చిన కరవు అంటున్న ప్రభుత్వ నేతలు - అదే మాటను రైతులకు ఎందుకు చెప్పడం లేదు' - Lok Sabha Elections 2024

టెట్​ ఫీజులు పెంచడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమే - సీఎం రేవంత్​కు హరీశ్​రావు లేఖ - BRS MLA Harish Rao Letter To CM

ABOUT THE AUTHOR

...view details