ETV Bharat / state

టెట్​ ఫీజులు పెంచడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమే - సీఎం రేవంత్​కు హరీశ్​రావు లేఖ - BRS MLA Harish Rao Letter To CM

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 12:11 PM IST

Updated : Apr 1, 2024, 1:43 PM IST

BRS MLA Harish Rao Letter To CM Revanth : టెట్‌ ఫీజులు పెంచడంపై సీఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. టెట్‌ ఫీజులను భారీగా పెంచారని, టెట్‌ ఫీజుల్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీలు ఇవ్వలేదని తెలిపారు. నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.

Telangana TET Exam 2024
BRS MLA Harish Rao Letter To CM Revanth

BRS MLA Harish Rao Letter To CM Revanth : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఆక్షేపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరమన్న ఆయన, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

అద్భుతమైన తెలంగాణ - 100 రోజుల్లోనే అస్తవ్యస్తమవుతుందని భావించలేదు : కేసీఆర్ - KCR Fires on Congress

BRS MLA Harish Rao Letter On Increasing Tet Exams Fees : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్‌ రాసినా, రెండు పేపర్లు రాసినా ఫీజు రూ.400లు మాత్రమే అన్న హరీశ్ రావు, ఇప్పుడు టెట్ ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఎస్‌ఈ నిర్వహించే సీ టెట్‌తో పోల్చితే, టెట్ ఫీజులు రెట్టింపుగా ఉన్నాయని పేర్కొన్నారు. రిజర్వుడ్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్‌ కేటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీ-టెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్‌ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నారని కానీ, టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదని అన్నారు.

Increasing Tet Exams Fees : టెట్ ఫీజుల పెంపు, రిజర్వుడ్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకపోవడాన్ని నిరసిస్తూ బీఈడీ, డీఎడ్‌ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్నారని, పుస్తకాలు వదిలి రోడ్లకెక్కి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని హరీశ్​రావు మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన అని ప్రశ్నించారు. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, వెంటనే టెట్‌ ఫీజులు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున పోరాటం తప్పదని హరీశ్​రావు హెచ్చరించారు.

Telangana TET Exam 2024 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దరఖాస్తుకు తెలంగాణ విద్యాశాఖ ఇటీవల రుసుములను భారీగా పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఒక పేపర్‌ రాస్తే రూ.200 రుసుము ఉండగా, దాన్ని రూ.వెయ్యికి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుము ఉండగా, దాన్ని రూ.2,000కు పెంపుదల చేసింది. ఈ మేరకు టెట్‌కు సంబంధించిన సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రుసుముల వివరాలు, ఇతర అంశాలను వెల్లడించింది.

టీఎస్​ టెట్​ నోటిఫికేషన్​, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల - జులై 17 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్​

ప్రభుత్వ టీచర్ల పదోన్నతికి టెట్‌ తప్పనిసరి - టెన్షన్‌లో సీనియర్లు

Last Updated :Apr 1, 2024, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.