తెలంగాణ

telangana

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ కాపాడుతుంది : అమిత్ షా - Amit Shah Secunderabad Meeting

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 10:11 PM IST

Amit Shah Allegations on Congress Party : కాంగ్రెస్‌ పార్టీ, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ఆరోపించారు. ఫేక్‌ వీడియోను, ముఖ్యమంత్రి సైతం సర్క్యులేట్‌ చేశారంటూ తప్పుబట్టారు. ఫేక్‌ వీడియోలు సర్క్యూలేట్‌ చేస్తే, దిల్లీ పోలీసులు రాకుండా ఎలా ఉంటారని అమిత్‌ షా ప్రశ్నించారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన అమిత్​షా ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని పునరుద్ఘాటించారు. సికింద్రాబాద్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్​షా, ఈటలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Amit Shah Comments on Congress and BRS
Home Minister Amit Shah Election Campaign (ETV BHARAT)

Amit Shah Election Campaign in Secunderabad : తెలంగాణలో లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు, బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. 10 స్థానాలకు పైగా సీట్లు దక్కించుకోవాలని, ప్రణాళికలతో ముందుకెళ్తుంది. కమలం పార్టీ అధికారంలోకి మళ్లీ వస్తే, రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ఓ ఫేక్‌ వీడియోను కాంగ్రెస్‌ సర్క్యులేట్‌ చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆ ఫేక్‌ వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఫార్వర్డ్​ చేశారంటూ షా తప్పుబట్టారు. సికింద్రాబాద్ పరేడ్​ గ్రౌండ్​​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్​షా పాల్గొని, మల్కాజ్​గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.​

తన మాటలను వక్రీకరించి ఫేక్‌ వీడియో సృష్టించారని, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదంటూ అమిత్​షా స్పష్టం చేశారు. ఫేక్‌ వీడియోలను సర్క్యూలేట్‌ చేస్తే, దిల్లీ పోలీసులు రాకుండా ఎలా ఉంటారంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్పందించారు. ఖర్గే, రాహుల్‌ ఓటు బ్యాంకు, ఒవైసీ ఓటు బ్యాంకు ఒకటే అంటూ అమిత్​షా విమర్శించారు.

"ప్రజలారా మీరే చెప్పండి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లను ఉంచాలా? తొలగించాలా? తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తోంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తాం. మోదీ సర్కార్​ రిజర్వేషన్లు తొలగిస్తుందని, నేను మాట్లాడినట్లు కాంగ్రెస్ ఫేక్ వీడియో సర్క్యూలేట్​ చేసింది."-అమిత్​షా, కేంద్ర హోంశాఖ మంత్రి

Home Minister Amit Shah Fires on Congress : దేశ వ్యాప్తంగా నక్సలిజంను అంతం చేస్తున్నామని, ఛత్తీస్‌గఢ్‌లో కొద్ది ప్రాంతం మినహా అంతటా తుదముట్టించామని అమిత్‌షా పేర్కొన్నారు. మన్మోహన్‌ సమయంలో, ముస్లింల ఓట్ల కోసం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఏబీసీ అంటే అసదుద్దీన్‌ ఒవైసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేనని వ్యాఖ్యానించారు. ముస్లింల ఓట్ల కోసం రామనవమి యాత్ర చేయలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ విమోచన దినం అధికారికంగా జరపాలా, వద్ద అన్న అమిత్​ షా, సజావుగా కొనసాగాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావల్సిన ఆవశ్యకం ఉందన్నారు.

ఇండి కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలి? :అర్టికల్‌ 370 ని రద్దు చేయకూడదని రాహుల్‌ గాంధీ లోక్‌సభలో అడ్డుపడ్డారన్న అమిత్​షా, మోదీ కృషితో ఇప్పుడు కశ్మీర్‌లో భారత జెండా సగర్వంగా ఎగురుతోందని గుర్తుచేశారు. పాకిస్తాన్‌ ఇంట్లోకి వెళ్లి మరీ సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా తీవ్రవాదులను మట్టుబెట్టామని పేర్కొన్నారు. పండుగలను కూడా సైనికుల మధ్య జరుపుకునే మోదీ ఓవైపు, సెలవుల కోసం బ్యాంకాక్‌ టూర్లు వేసే రాహుల్‌ బాబా మరోవైపు ఉన్నారని, ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. అలానే ఇండి కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్ నాయకులకు డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ కాపాడుతుంది : అమిత్ షా (ETV BHARAT)

పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్​లోనే పెడతాం : అమిత్​షా - Amit Shah Campaign in Telangana

బీఆర్​ఎస్​ను దింపడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది - కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు : ప్రధాని మోదీ - PM Modi Interview 2024

ABOUT THE AUTHOR

...view details