తెలంగాణ

telangana

అమెరికాలో మంచు తుపాను బీభత్సం- స్కూళ్లు, కరెంట్ బంద్- విమానాలు రద్దు

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 3:14 PM IST

US Winter Storm : అమెరికాలోని ఈశాన్య ప్రాంతాన్ని మంచు తుపాను ముంచెత్తింది. దీంతో చాలా చోట్ల హిమపాతం భారీగా నమోదైంది. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్‌, బోస్టన్‌లలో దాదాపు 1,200 విమానాలు రద్దవగా, మరో 2,700 విమాన సర్వీసుల్లో జాప్యం ఏర్పడింది. దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని మంగళవారం తీవ్ర ముంచు తుపాను కమ్మేసింది.
ఈ మంచు తుపాను కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగింది.
తపాను వల్ల లక్షా 50 వేల కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈశాన్య ప్రాంతంలోని పాఠశాలలన్నీ మూతపడ్డాయి.
న్యూయార్క్‌, మస్సాచుసెట్స్‌, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు మాత్రమే నిర్వహిస్తున్నారు.
ఈశాన్య అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించడాన్ని నిషేధించారు.
న్యూయార్క్‌, బోస్టన్‌లలో దాదాపు 1,200 విమానాలు రద్దయ్యాయి.
మరో 2,700 విమాన సర్వీసుల్లో జాప్యం ఏర్పడింది.
న్యూయార్క్‌ నగరంలో 744 రోజుల తర్వాత మంచుపడింది.
న్యూయార్క్​లో 2.5 అంగుళాల మేర హిమపాతం నమోదైంది.
స్థానిక ప్రజలు తమ వద్ద ఉన్న పరికరాలతో పరిసరాల్లోని మంచును తొలగిస్తున్నారు.
ప్రభుత్వం భారీ యంత్రాల సహాయంతో రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించే చర్యలు చేపట్టింది.
మంచును తొలగిస్తున్న సిబ్బంది
మంచులో ఆడుకుంటున్న పిల్లలు
రోడ్డుపై మంచును తొలగిస్తున్న వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details