తెలంగాణ

telangana

బీ కేర్​ఫుల్​- ఈ ఆహార పదార్థాలు మీ పిల్లలకు అస్సలు పెట్టకండి! - harmful food for kids

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 11:42 AM IST

5 Harmful Kids Food
5 Harmful Kids Food

Harmful Food For Kids : పిల్లలు పుష్టిగా, పొడుగ్గా, ఆరోగ్యంగా ఎదగాలని చాలా మంది తల్లిదండ్రులు వారికి ఎనర్జీ డ్రింక్స్ తాగిస్తుంటారు. నిజంగానే ఇవి మీ పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతాయా? ఉదయాన్నే మీ పిల్లలకు మీరు ఇచ్చే రకరకాల హెల్త్ డ్రింక్స్, బ్రేక్ ఫాస్టులు వారిని పోషకాలు అందిస్తాయా? ఇందులో వాస్తవమెంతా అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Harmful Food For Kids : బిజిబిజీ జీవితాల్లో మనం రెడిమేడ్ ఆహారాలకు ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేస్తున్నాం. ఉదయాన్నే తయారు చేసుకునే వీలు లేక పిల్లలకు తినేపించే వాటిని కూడా బయట నుంచే కొని తెచ్చేస్తున్నాం. అయితే, పిల్లలు ప్రాసెస్ చేయని ఆహారాలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మీరు ప్రతీ రోజూ వారికి పెట్టే బ్రేక్ ఫాస్ట్​లు, హెల్త్ డ్రింక్స్​ ప్రాసెస్ చేసినవే అని మీకు తెలుసా? వాటిని పిల్లలకు ఇవ్వకపోవటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో పిల్లల శరీరానికి హాని కలిగించే ఘగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాగే పిల్లలను ఆకర్షించేందుకు వాటిలో కలిపే కృత్రిమ రంగులు ఊబకాయం, మధుమేహం లాంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్నిపెంచుతాయని చెబుతున్నారు.

నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, చిన్నారులతో పాటు పెద్దవాళ్లు కూడా ఇంట్లో తయారుచేసిన చిరుధాన్యాలు, విత్తనాలు, న్యూట్రియంట్స్, మినరల్స్ ఉన్న ఆహారపదార్థాలనే తీసుకోవాలి. కానీ మనం పెడుతున్న రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్, డ్రింక్ పౌడర్స్ ప్రోసెస్ అయి శరీరానికి చేకూర్చే లాభాల కంటే ముప్పే ఎక్కువని నిపుణులు అంటున్నారు.

ప్యాకేజ్‌డ్ ఫ్రూట్ జ్యూస్
ఫ్రూట్ జ్యూస్​ల్లో ఎక్స్‌ట్రా షుగర్ లాంటివి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి హెల్తీ డ్రింక్స్ అయినప్పటికీ పండ్లు తిన్న దానితో సమానం కాదని, సాధ్యమైనంత వరకు జ్యూస్​లను తక్కువ తాగడమే మంచిదని చెబుతున్నారు.

రెడీమెడ్ బ్రెక్ ఫాస్ట్
బిజీబిజీ లైఫ్ కాబట్టి ఈ మధ్య చాలా మంది రెడీమెడ్ బ్రేక్ ఫాస్ట్​లను ఎంచుకుని పిల్లలకు పెడుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కోసం రెడీగా ఉండే ఆహార పదార్థాలన్నీ కళ్లకు ఇంపైన రంగులతో ఇట్టే ఆకర్షిస్తుంటాయి. చిన్నారులను వాటికి అట్రాక్ట్ అయ్యేలా చేసేందుకు వాటిలో ఎక్కువగా షుగర్ కంటెంట్, కృత్రిమ రంగులు కలుపుతుంటారు. ఇవి రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతాయి. సాధ్యమైనంత వరకూ ప్యాకేజ్ మీదున్న లేబుల్‌పై Whole-grain ఆప్షన్ ఉంటేనే తీసుకోవాలి.

ఫ్లేవర్డ్ యోగట్స్(పెరుగు)
పెరుగు అనేది ప్రోబయోటిక్స్ కలిగిన మంచి ఆహార పదార్థంగా అనుకుంటాం. కానీ, ఎటువంటి ఫ్లేవర్స్ కలపని యోగట్ మాత్రమే ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లేవర్స్ యోగట్స్​లో షుగర్, ఆర్టిఫీషియల్ కలర్స్ అధికంగా ఉండటం వల్ల దానిని తినకపోవడమే బెటర్.

కాండిమెంట్స్
బయట తెచ్చిన ఆహార పదార్థాల్లో సాస్, కెచప్ వంటి కాంబినేషన్లు తప్పనిసరి అని భావిస్తారు పిల్లలు. కానీ, కెచప్స్‌తో పాటు ఇతర సాస్‌ల్లో యాడెడ్ షుగర్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి చాలా ప్రమాదకరం. కనుక వీటికి దూరంగా ఉంచడమే మంచిది. తప్పనిసరి అయితే వాటిలో నేచరల్ ఇన్‌గ్రేడియంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు ఇవ్వడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ప్యాకేజ్‌డ్ ఫుడ్స్
రెడీమేడ్‌గా దొరికే ఏవైనా సరే అవి డేంజరే. ఈ విషయం మనసులో ఉంచుకుని కొన్ని ఫ్రూట్స్, స్నాక్స్ తీసుకునేందుకు ముందు కచ్చితంగా చెక్ చేసుకోండి. అవి whole ingredients ఉన్నవైతేనే తీసుకోవడం బెటర్. లేదంటే అవి మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ 7 అలవాట్లు చేసుకుంటే చాలు మీ లైఫ్​ ఛేంజ్​! ఆఫీస్​ నుంచి వచ్చాక ఈ పనులు చేయండి! - HABITS TO CHANGE YOUR LIFE

జీడిపప్పు తెగ తినేస్తున్నారా? బరువు పెరిగిపోయే ఛాన్స్ ఉంది- జాగ్రత్త! - Side Effects Of Cashews

ABOUT THE AUTHOR

...view details