ETV Bharat / health

ఈ 7 అలవాట్లు చేసుకుంటే చాలు మీ లైఫ్​ ఛేంజ్​! ఆఫీస్​ నుంచి వచ్చాక ఈ పనులు చేయండి! - HABITS TO CHANGE YOUR LIFE

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 1:02 PM IST

7 Habits To Change Your Life : ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు పనిలో బిజీబిజీగా గడిపేస్తున్నారు సరే. మరి వచ్చాక పర్సనల్​ లైఫ్​కు టైమ్​ కేటాయిస్తున్నారా? పనితో పాటు పర్సనల్ లైఫ్ కూడా బాగుండాలంటే మరిచిపోకుండా చేయాల్సిన పనులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

7 Habits To Change Your Life
7 Habits To Change Your Life

Habits To Change Your Life : జీవించడానికి పని చేయడం ఎంత ముఖ్యమో పర్సనల్ లైఫ్​ను ఎంజాయ్ చేయడమూ అంతే ముఖ్యం. సంతోషంగా ఉండాలంటే పనికీ, వ్యక్తిగత సమయానికి సమతుల్యత అనేది చాలా అవసరం. మీరు కెరీర్​లో బాగా ఎదిగేందుకు కష్టపడుతున్నారు మంచిదే. కానీ, మీకోసం మీరు కాస్త సమయం కేటాయించలేనప్పుడు మీరు సంపాదించేదాన్ని మీరు ఆస్వాదించలేనప్పుడు అదంతా శూన్యమే అనిపిస్తుంది. అందుకే ఆఫీసు తర్వాత మీ వ్యక్తిగత జీవితం కోసం మీరు తప్పకుండా చేయాల్సినవి, అలవాటుగా మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు మీరు ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన జీవితాన్ని గడిపేందుకు సహాయపడతాయట. అవేంటో చూద్దాం.

డిస్‌కనెక్ట్
దాదాపు ఎనిమిది నుంచి పది గంటల పాటు మీరు ఆఫీస్ పనిలో భాగంగా బిజీబిజీగా గడిపేసి ఉంటారు. అందుకే ఆఫీస్ అయ్యాక మీరు మొదటగా చేయాల్సింది ఆఫీసుకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్​టాప్​ ఆఫ్ చేసేయడం లేదా అక్కడి నుంచి వచ్చే మెసేజ్​లు, ఫోన్లు, నోటిఫికేషన్ల నుంచి డిస్‌కనెక్ట్ అవ్వాలి. మీకోసం మీరు గడిపే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.

శారీరక శ్రమ
మీరు ఆఫీస్ నుంచి వచ్చాక సాయంత్రం శారీరక శ్రమను అలవాటుగా మార్చుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్, యోగా, జిమ్, డాన్స్ లాంటి ఎలాంటిదైనా సరే చేయవచ్చు. శారీరకంగా కాస్త శ్రమ కలిగించే పనిని రోజులో కనీసం అరగంట పాటైనా చేసి ఆనందంగా గడపడం మీ పర్సనల్ లైఫ్​కు చాలా మంచిది.

ఆసక్తి ఉన్న వాటిపై సమయం కేటాయించడం
కొందరికి పాటలు పాడటం అంటే ఇష్టం. ఇంకొందరికి మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకొందరికి పెయింటింగ్, మరికొందరికి తోటపని అలా మీ అభిరుచికి తగినది మీకు బాగా ఆసక్తి కలిగి ఉన్న పనులు ఉంటాయి. వాటిని ఎంచుకుని ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపైనా చేయండి. ఇలా మీకు సంతోషాన్ని, సంతృప్తినిచ్చే పనిని మీరు చేయడం వల్ల మీలో తెలియని ఉత్సాహం మాత్రమే కాదు చాలా రిలీఫ్​గా ఫీలవుతారు.

ఇష్టమైన వారితో గడపాలి
మీకు ఇష్టమైన వారితో కాసేపు మాట్లాడటం, వారితో కలిసి భోజనం చేయడం, కలిసి అలా నడవటం లాంటివి మీ పర్సనల్ లైఫ్​ను చాలా మార్చేస్తాయి. మీ ఎమోషన్స్​ కంట్రోల్ చేసుకోవడానికి, మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేయడానికి మీకు ఇష్టవారితో గడపటం చాలా మంచిది.

ప్రాక్టీస్ ముఖ్యం
మీ మనసును ప్రశాంతంగా మార్చేలా యోగా, ధ్యానం వంటి మానసిక వ్యాయామాలు చేయడం చాలా అవసరం. ఇవి ఒత్తిడి, ఆందోళనల నుంచి దూరం చేస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

నో చెప్పడం నేర్చుకోవాలి
మీ విలువను, ప్రాధాన్యాన్ని తగ్గించేవి, మీకు పనికిరాని పనులు చేయడానికి నిస్సందేహంగా నో చెప్పడం అలవాటు చేసుకోండి. మోహమాటానికో, ఇంకోదానికో పోయి మీ వ్యక్తిగత సమయాన్ని వృధా చేసుకోకండి. మీ మనస్సుకు, శరీరానికి అనుగుణంగా లేని పనులు చేయకండి.

రాత్రి పూట జ్వరం తరచూ ఇబ్బంది పెడుతుందా? లైట్​ తీసుకోవద్దు- ఈ జాగ్రత్తలు మస్ట్​! - Causes Of Night Fever In Telugu

కూరలో మసాలా ఎక్కువైందా? డోంట్​ వర్రీ- ఈ ఇంటి చిట్కాలతో అంతా సెట్​! - Reduce Spiciness Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.