MG Displays 3 New EV Cars In India :ఎంజీ మోటార్ ఇండియా 'MG 2.0' ఇనీషియేటివ్‌లో భాగంగా బుధవారం మూడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రదర్శించింది. అవి : ఎంజీ 4, ఎంపీ 5, ఎంజీ సైబర్‌స్టర్. వీటిలో ఎంజీ సైబర్‌స్టర్ అనేది ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కావడం గమనార్హం.
త్వరలోనే లాంఛ్!
వాస్తవానికి ఎంజీ మోటార్ ఇండియా తాము రూపొందించిన ఎంజీ 4 ఈవీని 2023 ఆటో ఎక్స్‌పోలోనే ప్రదర్శించింది. మళ్లీ ఇప్పుడు మిగతా రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్(ఎంజీ 5, ఎంజీ సైబర్‌స్టర్)తో కలిపి మరోసారి దానిని ప్రదర్శించింది. త్వరలోనే వీటిని లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవే కనుక లాంఛ్ అయితే ఎంజీ కోమెట్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ కార్ల సరసన ఇవి చేరతాయి.
MG 4 EV Features :
ఎంజీ ఈవీ ఎక్స్టీరియర్ చూడడానికి స్లీక్ లైన్స్‌తో, పాలిష్డ్ సర్ఫేస్తో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనిని సైబర్‌స్టర్ రోడ్‌స్టర్ కాన్సెప్ట్‌ను ఇన్స్పిరేషన్గా తీసుకుని తీర్చిదిద్దారు.
ఇంటీరియర్ విషయానికి వస్తే, దీనిలో రెండు ఫ్లోటింగ్ స్క్రీన్లను అమర్చారు. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రెండోది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దీనిలో సెంటర్ కన్సోల్, రోటరీ డయెల్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉన్నాయి. అలాగే దీనిలో 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, ఏడీఏఎస్ టెక్నాలజీలను పొందుపరిచారు.
MG 4 EV Powertrain Range :
ఈ ఎంజీ 4 ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. అవి: 51 కిలోవాట్, 64 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీలు. ఇవి వరుసగా 170 హెచ్‌పీ, 203 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఈ రెండు వెర్షన్లు కూడా 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తాయి. ఈ బ్యాటరీలు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. 150 కిలోవాట్ డీసీ ఛార్జర్‌తో వీటిని ఫాస్ట్ ఛార్జ్ చేయవచ్చు. 51 కిలోవాట్ బ్యాటరీ ఉన్న ఎంజీ 4 డ్రైవింగ్ రేంజ్ 350 కి.మీ; 51 కిలోవాట్ బ్యాటరీ ఉన్న ఎంజీ 4 రేంజ్ 452 కి.మీ రేంజ్ ఉంటుంది.